మేడారం మహా జాతర.. V6 వెలుగు ఫోటో గ్యాలరీ

మేడారం మహా జాతర.. V6 వెలుగు ఫోటో గ్యాలరీ

మేడారం మహాజాతర అంగరంగా వైభవంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి 21వ తేదీ ప్రారంభమైన మేడారం జాతర..ఫిబ్రవరి 24వ తేదీ ముగుస్తుంది. ఈ క్రమంలో వనదేవతలను దర్శించుకునేందుకు తెలంగాణతోపాటు సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, మహారాష్ట్రాల నుంచి తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ వేడుకను ప్రభుత్వ లాంఛనాల ప్రకారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.

నేడు వన ప్రవేశం

సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజులు శనివారం వన ప్రవేశం చేయనున్నారు. ఈ కార్యక్రమం అయిపోగానే మేడారం మహాజాతర పూర్తయినట్లు గిరిజన పూజారులు అధికారికంగా ప్రకటిస్తారు. బుధవారం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు రాకతో మొదలైన మహాజాతర వన ప్రవేశంతో ముగుస్తుంది. సమ్మక్క, సారలమ్మను వనం నుంచి జనంలోకి తీసుకొచ్చిన పూజారులే తిరిగి వనప్రవేశం చేయిస్తారు. ఇందుకోసం శనివారం మధ్యాహ్నం నుంచే గద్దెల దగ్గర పూజలు జరుగుతాయి.