మేడారంలో గుండెపోటుతో భక్తుడు మృతి.. నిద్రలేచేసరికి విగతజీవిగా మారిన ECIL ఉద్యోగి

మేడారంలో గుండెపోటుతో భక్తుడు మృతి.. నిద్రలేచేసరికి విగతజీవిగా మారిన ECIL ఉద్యోగి

తాడ్వాయి, వెలుగు:  గుండెపోటుతో భక్తుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది.  కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. హైదరాబాద్ లోని ఈసీఐఎల్ కు చెందిన ఆర్ఎం వినోద్(58),  గురువారం మేడారంలో అమ్మవార్ల దర్శనానికి ఫ్యామిలీతో వెళ్లారు. 

దర్శనం అనంతరం జంపన్న వాగు సమీపంలో రాత్రి నిద్రపోయారు. వినోద్ గురక పెడుతుండగా కుటుంబసభ్యులు నిద్ర పోతుండని భావించారు. శుక్రవారం తెల్లవారుజామున లేచి చూసేసరికి వినోద్ విగతజీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యులు వెంటనే మేడారం ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే  చనిపోయినట్టు తెలిపారు.