మేడారం భక్తులకు గుడ్ న్యూస్ : పస్రా నుంచి మేడారం ఫ్రీ బస్‌‌.. చింతల క్రాస్ దగ్గర పార్కింగ్

మేడారం భక్తులకు గుడ్ న్యూస్ : పస్రా నుంచి మేడారం ఫ్రీ బస్‌‌..  చింతల క్రాస్ దగ్గర పార్కింగ్

మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ పస్రా నుంచి ఫ్రీ సర్వీస్‌‌లు నడుపుతోంది. ప్రైవేట్‌‌ వాహనాల్లో వచ్చిన భక్తులు తమ వాహనాలను చింతల్‌‌ క్రాస్‌‌ వద్ద గల పార్కింగ్‌‌ ఏరియాల్లో నిలిపి అక్కడి నుంచి ఉచిత బస్సుల్లో మేడారం చేరుకోవచ్చు. ఇందుకోసం 20 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ ఆఫీసర్లు తెలిపారు. అలాగే ఆర్టీసీ బస్సుల ద్వారా బుధవారం నాటికి సుమారు మూడు లక్షల మందిని మేడారం చేర్చినట్లు ఆర్టీసీ వరంల్ రీజినల్‌‌ మేనేజర్‌‌ విజయభాను, డివిజన్‌‌ మేనేజర్‌‌ ఆపరేషన్స్‌‌ భాను కిరణ్‌‌ తెలిపారు.