బండెనక బండి కట్టి.. ఎడ్లబండ్లతో మేడారం చేరుకుంటున్న భక్తులు

బండెనక బండి కట్టి.. ఎడ్లబండ్లతో మేడారం చేరుకుంటున్న భక్తులు

సమ్మక్క సారలమ్మల దర్శనం కోసం ఊళ్లన్నీ మేడారం వైపే సాగుతున్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు బస్సులు, ప్రైవేట్​ వాహనాల్లో తరలివస్తుండగా.. కొందరు మాత్రం ఎడ్లబండ్లు కట్టుకుని జాతరకు పయనమవుతున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీ పల్లెల్లోని ఆదివాసీలు తల్లులకు ఇంటి వద్ద సంప్రదాయ పూజలు చేపట్టి  అడవి దారుల గుండా ఎడ్లబండ్లపై మేడారం తొవ్వ పడుతున్నారు. నాలుగు రోజులకు సరిపడా సామగ్రిని మూటగట్టుకుని అమ్మవార్ల సన్నిధికి చేరుతున్నారు. -