మేడారం గుడి మూసివేత.. భక్తులెవరూ దర్శనం కోసం రావొద్దని సూచన

మేడారం గుడి మూసివేత.. భక్తులెవరూ దర్శనం కోసం రావొద్దని సూచన

ములుగు జిల్లా: మేడారంలో విధులు నిర్వహించిన దేవాదాయ శాఖలోని ముగ్గురు అదికారులకు  కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో కరోనా కట్టడి కోసం మేడారం లోని సమ్మక్క సారలమ్మ గుడి రేపట్నుంచి మూసి వేయాలని నిర్ణయించారు. ఆదివారం మేడారంలో దేవాదాయ శాఖ అధికారులు, పూజారులు సమావేశమయ్యారు. చర్చల అనంతరం మేడారం లో సమ్మక్క – సారలమ్మ గుడిని సోమవారం నుండి మూసి వేస్తున్నట్లుగా వన దేవతల పూజారులు ప్రకటించారు. వన దేవతలను దర్శించుకునేందుకు రేపటి నుండి భక్తులు మేడారంకు రావద్దని కోరారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ మినీ మేడారం జాతరలో విదులు నిర్వర్తిస్తున్న దేవాదాయ శాఖ అధికారులకు ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని జిల్లా వైద్యాధికారి ఆలం అప్పయ్య తెలిపారు. కరోనా కట్టడి చేసేందు కోసం మేడారం సమ్మక్క సారాలమ్మ గుడిలను మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మార్చి,ఏప్రిల్ లో పెట్రోల్ ధరలు తగ్గే ఛాన్స్

‘గేటు దాటి వస్తే జనం తంతారని భయం‘

ప్రశ్నించే యువత అంటే ప్రభుత్వానికి నచ్చట్లే

వీడియో: చెల్లిని కొట్టాడని బావను ట్రక్కుకు కట్టి లాక్కెళ్లిన బామ్మర్ది