నీటికుంటలో పడిపోయిన తల్లీకూతుర్లు.. హత్యా.. ఆత్మహత్యా..

నీటికుంటలో పడిపోయిన తల్లీకూతుర్లు.. హత్యా.. ఆత్మహత్యా..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శామీర్పేట్ మండలం బొమ్మరాసిపేటలోని అబ్బనాకుంటలో తల్లీకూతుళ్లు పడిపోయారు. గ్రామానికి చెందిన కలమ్మ(50), కూతురు కవిత(30) కుంటలో పడిపోయారని స్థానికులు తెలిపారు. 

వెంటనే వారిని గమనించిన స్థానికులు చెరువులోకి దిగి వెతకగా.. కలమ్మ దొరికింది. దీంతో ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కలమ్మ కూతురు కవిత నీటిలో గల్లంతు అయింది. ఈ క్రమంలో స్థానికులు గజ ఈతగాళ్లకు సమాచారం ఇచ్చారు. కవితను నీటి కుంటలో వెతుకుతున్నారు ఈతగాళ్లు. అసలు తల్లీకూతుర్లు నీటి కుంటలో ఎందుకు పడ్డారు.. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయారా.. లేక వాళ్లే ఆత్మహత్య చేసుకోవడానికి నీటిలో పడిపోయారా అన్న.. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.