మీడియాటెక్ నుంచి కొత్త ప్రాసెసర్

మీడియాటెక్ నుంచి కొత్త ప్రాసెసర్

స్నాప్ డ్రాగన్ 8 జెన్ వన్ ప్రాసెసర్ కి పోటీగా  డైమెన్ సిటీ 9200 5జీ పేరుతో మీడియాటెక్ కొత్త ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ ని లాంచ్ చేసింది. దీన్ని రాబోయే ప్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లతో మార్కెట్ లోకి తీసుకురానుంది. ఈ ప్రాసెసర్ గేమింగ్ కి ప్రత్యేకం. ఆల్ట్రా షార్ప్ ఇమేజ్ క్యాప్చరింగ్, వైఫై 7 తో 6.5 జీబీపీఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది.  

డైమెన్ సిటీ 9200 చిప్.. ఆర్మ్ కార్టెక్స్ ఎక్స్3, రే ట్రేసింగ్ హార్డవేర్ ఇంజిన్ తో ఆర్మ్ ఇమ్మోర్టాలిస్ జి715 జీపియూ కి సపోర్ట్ చేసే మొదటి స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ ఇది. దీనివల్ల గేమింగ్ డిస్ ప్లే, రిసొల్యూషన్, డిజైన్స్, గ్రాఫిక్స్ ఎక్స్ పీరియన్స్ బాగుంటుంది. ఇది పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్ కూడా. ఈ ప్రాసెసర్ మిగితా ప్రాసెసర్ల కంటే 30శాతం తక్కువ బ్యాటరీని వాడుకుంటుంది.