మెడికల్ పీజీ దరఖాస్తు గడువు అక్టోబర్16కు పొడిగింపు

మెడికల్ పీజీ దరఖాస్తు గడువు అక్టోబర్16కు పొడిగింపు

హైదరాబాద్, వెలుగు: పీజీ మెడికల్ డిగ్రీ/డిప్లొమా కోర్సులకు సంబంధించి ఆన్​లైన్ దర ఖాస్తుల గడువును కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్ సైన్సెస్ పొడిగించింది. గతంలో ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వగా.. దాన్ని 16 సాయంత్రం 6 గంటల వరకు పొడిగిస్తూ అవకాశం ఇచ్చింది. 

అభ్యర్థులు https://pvttspgmed.tsche.in వెబ్​సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవైనా సమస్యలు ఎదురైతే..  టెక్నికల్ హెల్ప్ కోసం 9392685856, 9059672216, 7842136688, tsmedadm.tech@gmail.com ను సంప్రదించవచ్చు.