కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కరెంట్ కోతలు

కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కరెంట్ కోతలు

వరంగల్: పేరుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మూడు, నాలుగు జిల్లాల నుంచి రోజూ కొన్ని వందల మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారు. అలాంటి పెద్దాసుపత్రిలో పవర్ ప్రాబ్లమ్ తో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ కోతలతో వైద్య పరీక్షలు జరగడం లేదు. 

వరంగల్ కేఎంసీలోని పీఎంఎస్ఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో కరెంట్ కోతలతో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఆరు అంతస్తుల్లోని 250 పడకల సామార్థ్యం కలిగిన ఈ హాస్పిల్ లో అంకాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, పీడియాట్రిక్, యూరాలజీ,ఆర్థోపెడిక్ విభాగాలన్నీ ఉన్నాయి. ఇందులో రోజూ 600లకు పైగా  ఓపీ సేవలతో పాటు 20 ఆపరేషన్లు జరుగుతాయి. అయితే కరెంట్ లేకపోవడం వల్ల ఆపరేషన్లు, స్కానింగ్, రక్త, మూత్ర పరీక్షలను నిలిపివేశారు. 

ఆసుపత్రిలో కరెంట్ సరఫరా లేక పోవటంతో వార్డులన్నీ చీకటిమయంగా మారాయి. ప్యాన్లు తిరగక పోవటంతో రోగులు ఉక్క పోతతో అల్లాడుతున్నారు. తాగ డానికి నీళ్లు రావటం లేదు. స్కానింగ్ కోసం వచ్చిన రోగులను  అంబులెన్స్ లోనే ఉంచుతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందా అని రోగులు, వారి కుటుంబ సభ్యులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. కరెంట్ లేకపోవడంతో కొందరు తిరిగి వెళ్లిపోతున్నారు. ఎంజీఎంకు వెళితే స్కానింగ్ కోసం డాక్టర్లు ఇక్కడికి పంపిచారని చెబుతున్నారు రోగుల బంధువులు. కరెంట్ లేదని రెండు గంటల నుంచి  అంబెలెన్స్ లో నే ఉంచారంటున్నారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. హాస్పిటల్లో కరెంటు సరఫరాకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 

సాంకేతిక సమస్యల వల్లే...

సాంకేతిక సమస్య వల్ల కరెంట్ సరఫరాలో ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు అధికారులు. దీంతో రోగులకు వైద్య సేవలు అందించలేక పోతున్నామన్నారు. ఇదేవిషయం  కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం అందించామని చెప్పారు.

: డాక్టర్  గోపాల్ రావు, పీఎంఎస్ఎస్, నోడల్  అధికారి, వరంగల్.

మరిన్ని వార్తల కోసం...

ఎల్లుండి నుంచి వడ్ల కొనుగోళ్లు ప్రారంభం

అక్బరుద్దీన్పై నమోదైన కేసుల కొట్టివేత