మెడికల్ షాపుల బంద్ సక్సెస్..తెలంగాణ చాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్లడి

మెడికల్ షాపుల బంద్ సక్సెస్..తెలంగాణ చాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్లడి

అబిడ్స్, వెలుగు: దేశవ్యాప్తంగా ఉన్న 12 లక్షల మెడికల్ షాప్ నిర్వాహకులు తలపెట్టిన ఒక రోజు సమ్మె విజయవంతంగా ముగిసిందని తెలంగాణ చాంబర్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ నాయకులు తెలిపారు. బుధవారం అబిడ్స్​లోని చాంబర్ కార్యాలయంలో అధ్యక్షుడు గీసులాల్ జైన్, ట్రెజరర్ ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడారు. 

ఆన్​లైన్​లో మందుల అక్రమ అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నియంత్రించాలని, అలాగే నకిలీ మందుల విక్రయాలను నివారించాలనే డిమాండ్లతో ఈ బంద్​చేపట్టినట్లు తెలిపారు.