గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ధర్నా

గాంధీ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది ధర్నా
  •      ఉదయం 9 -11 గంటల మధ్య 
  •     2 గంటల పాటు విధుల బహిష్కరణ

పద్మారావునగర్​, వెలుగు : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ సర్వీసులు మినహా అన్ని వైద్యసేవలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్​గాంధీ (టీజీజీడీఏ) యూనిట్​ ప్రతినిధులు తెలిపారు. బుధవారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు విధులను బహిష్కరించి, ఆందోళన చేయనున్నట్టు యూనిట్ జనరల్​సెక్రటరీ డాక్టర్ భూపేందర్​ రాథోడ్​ చెప్పారు.

 ప్రభుత్వ డాక్టర్లకు రావాల్సిన యూజీసీ పీఆర్సీ ఏరియర్స్​, ఈఎల్ఎన్ హెన్స్​మెంట్, టీఏ, ప్రొఫెసర్ల సీఏఎస్​, స్టాఫ్​ స్ర్టెంథనింగ్​ ప్రధాన డిమాండ్లని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది కూడా పాల్గొనాలని కోరారు.