మన దవాఖాన్లకు ఫారిన్​ పేషెంట్లు

మన దవాఖాన్లకు ఫారిన్​ పేషెంట్లు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మనదేశానికి వచ్చే మెడికల్ టూరిస్ట్‌‌‌‌ల సంఖ్య ఏటా పెరుగుతోంది. విదేశీ టూరిస్టుల్లో 6శాతం మంది వైద్యసేవల కోసం వచ్చే వాళ్లేనని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇలా వచ్చిన వాళ్ల సంఖ్య 2017లో 4,95,000 కాగా, 2018 నాటికి వీరి సంఖ్య 6,40,000లకు పెరిగిందని కేంద్ర ప్రభుత్వం లోక్‌‌‌‌సభలో సోమవారం వెల్లడించింది. రాష్ట్రాల వారీగా మనదేశానికి వస్తున్న మెడికల్ టూరిస్టుల వివరాలు ఇవ్వాలన్న ప్రశ్నకు జవాబుగా ఈ వివరాలు చెప్పింది. 2018లో తమిళనాడుకు అత్యధికంగా 60.74 లక్షల మంది ఫారెన్ టూరిస్టులు వచ్చారు. మెడికల్​ టూరిస్టులు వచ్చే రాష్ట్రాల లిస్ట్​లో మన రాష్ట్రం 15వ ప్లేస్​లో నిలిచింది. 2017లో 2.54 లక్షల మంది మెడికల్​ టూరిస్టులు రాష్ట్రానికి రాగా, 2018లో 3.78 లక్షల మంది వచ్చారని వివరించింది. అయితే, చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌‌‌‌కు వచ్చే మెడికల్ టూరిస్టుల సంఖ్య తక్కువేనని డాక్టర్లు చెబుతున్నరు. మెడికల్ హబ్‌‌‌‌గా ఎదుగుతోందని ప్రభుత్వ ప్రచారమే తప్ప, 20 వేలకు మించి మెడికల్ టూరిస్టులు రావడంలేదంటున్నరు. ఇక్కడ ప్యాకేజీలు ఎక్కువగా ఉండడం, సరైన వసతులులేక పోవడంవల్ల విదేశీ మెడికల్ టూరిస్టులను ఆకర్షించడంలో కార్పొరేట్ హాస్పిటళ్లు వెనకబడుతున్నాయని సీనియర్ డాక్టర్‌‌‌‌‌‌‌‌ ఒకరు చెప్పారు.