
భారత దేశవాళీ క్రికెట్ లో అత్యంత నిలకడగా రాణించే ఆటగాళ్లలో ఉత్తరాఖాండ్ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ కు మరోసారి నిరాశే మిగిలింది. ఇంగ్లాండ్ తో బుధవారం (జూలై 23) ప్రారంభమైన నాలుగో టెస్టులో టీమిండియా ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. లీగ్ ఏదైనా అభిమన్యు దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తాడు. 2015 నుంచి టెస్ట్ క్రికెట్ లో భారీ ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. అయితే టీమిండియా అరంగేట్రం అతనికి అందని ద్రాక్షగా మిగిలిపోయింది. కరుణ్ నాయర్ ను నాలుగో టెస్టు నుంచి తప్పించి మరోసారి సాయి సుదర్శన్ కు ఛాన్స్ ఇచ్చారు గానీ ఈశ్వరన్ ను మాత్రం పక్కన పెట్టారు.
భారత టెస్ట్ జట్టులోకి అభిమన్యు ఈశ్వరన్ తొలిసారి 2021 స్థానం సంపాదించాడు. ఇంగ్లాండ్‌తో జరిగే స్వదేశీ సిరీస్‌కు స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ నాలుగేళ్లలో ఈశ్వరన్ కు టెస్ట్ అరంగేట్రం చేయలేకపోవడం విచారకరం. ఈశ్వరన్ తర్వాత భారత స్క్వాడ్ లోకి ఎంపికైన 15 మంది ఆటగాళ్ళు ఇండియా తరపున టెస్ట్ క్రికెట్ లో తమ తొలి మ్యాచ్ ఆడేశారు.
కెయస్ భరత్, సూర్య కుమార్ యాదవ్,జైశ్వాల్, ముకేశ్ కుమార్, ఇషాన్ కిషన్,ప్రసిద్ కృష్ణ , పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్,ఆకాష్ దీప్, పడికల్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రానా, సాయి సుదర్శన్, కంబోజ్ టెస్ట్ టీమిండియా తరపున టెస్ట్ అరంగేట్రం చేశారు. నాలుగో టెస్ట్ లో హర్యానా ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఇండియా తుది జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం.
►ALSO READ | IND vs ENG 2025: 5 వికెట్లతో చెలరేగిన స్టోక్స్.. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా ఆలౌట్
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో అభిమన్యు ఈశ్వరన్ కు సెలక్టర్లు చోటు కల్పించారు. స్క్వాడ్ లో ఎంపికైనా అభిమన్యు ఈశ్వరన్ కు తుది జట్టులో నిరాశే ఎదురైంది. ప్లేయింగ్ 11లో అతడికి ఒక్క మ్యాచ్ లో కూడా ఆడే అవకాశం రాలేదు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉండడంతో అభిమన్యు బ్యాకప్ ఓపెనర్ గానే జట్టులో కొనసాగాడు. ఇంకెంత కాలం అభినయ ఈశ్వరన్ కు ఈ దురదృష్టం వెంటాడుతుందో చూడాలి.
గత ఏడాది జరిగిన దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలోనూ అభిమన్యు అసాధారణంగా రాణించాడు. ముఖ్యంగా ఇరానీ ట్రోఫీలో 191 పరుగుల భారీ స్కోర్ చేసి అదరగొట్టాడు.ఇప్పటివరకు 161 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్ లు ఆడిన అభిమన్యు ఈశ్వరన్ 49 యావరేజ్ తో 7404 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు.. 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లో 19 పరుగులు చేసి విఫలమయ్యాడు. అయితే రెండో టెస్టుల్లో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 68.. రెండో ఇన్నింగ్స్ లో 80 పరుగులు చేసి రాణించాడు.
Since Abhimanyu Easwaran's first call-up, 15 players have debuted for India before him. 😳🇮🇳 pic.twitter.com/LnxC4OIWbN
— CricketGully (@thecricketgully) July 23, 2025