ఇందిరా గాంధీ రికార్డ్ బ్రేక్ చేసిన మోదీ

ఇందిరా గాంధీ రికార్డ్ బ్రేక్ చేసిన మోదీ

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరుతో ఉన్న రికార్డ్ ను బ్రేక్ చేశారు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ. ఎక్కువ రోజులు ప్రధాన మంత్రిగా.. అది కూడా వరసగా కొనసాగటం విషయంలో ఈ రికార్డ్ నమోదైంది. 

1966, జనవరి 24వ తేదీ నుంచి 1977 మార్చి 24వ తేదీ వరకు ఇందిరా గాంధీ 4 వేల 077 రోజులు ప్రధాన మంత్రిగా నిరంతరాయంగా కొనసాగారు. ఇప్పుడు మోదీ ఆ రికార్డ్ ను బ్రేక్ చేశారు. 2025, జూలై 25వ తేదీతో.. నిరంతరాయంగా.. వరసగా 4 వేల 78 రోజులు ప్రధానమంత్రి పదవిలో ఉండి.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు మోదీ. 

ఈ ఒక్క రికార్డ్ మాత్రమే కాదు.. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టిన వ్యక్తి.. ఇన్ని రోజులు ప్రధాన మంత్రిగా కొనసాగిన వ్యక్తి కూడా మోదీనే. కాంగ్రెసేతర ప్రధానుల్లో వరసగా రెండు సార్లు.. ఐదేళ్ల పూర్తి కాలం ప్రధాన మంత్రి పదవిలో ఉన్నది కూడా మోదీనే. 

ALSO READ : 30 వేల అడుగుల ఎత్తులో.. విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. పురుడుపోసిన ఫ్లయిట్ క్యాబిన్ క్రూ సిబ్బంది

మూడు రాష్ట్రాన్ని.. మూడు సార్లు దేశంలో వరసగా అధికారాన్ని నిలబెట్టుకున్న వ్యక్తిగా మోదీ మరో రికార్డ్ క్రియేట్ చేశారు. 2002, 2007, 2012 గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ వరస విజయాలతో.. మోదీ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2014, 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయన సారధ్యంలోనే బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో కొనసాగుతుంది. 30 ఏళ్లుగా తన నాయకత్వంలోని గుజరాత్ రాష్ట్రంలో... కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావటం.. నిలబెట్టటం ద్వారా అరుదైన రికార్డ్ సృష్టించారు ప్రధాని మోదీ..

ప్రధానమంత్రిగా మోదీ మరో ఏడాది పూర్తి చేసుకుంటే.. జవహర్ లాల్ నెహ్రు పేరుతో ఉన్న రికార్డ్ సైతం బ్రేక్ చేసిన వ్యక్తిగా నిలుస్తారు.