
హైదరాబాద్: హోం అప్లియన్సెస్ కంపెనీ బటర్ ఫ్లై పేరు వినే ఉంటారు. బటర్ ఫ్లై కంపెనీ పేరిట నకిలీ ప్రొడక్ట్స్ విక్రయిస్తున్న కిరణ్, బల్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బేగం బజార్ ఫీల్ ఖానా కాంప్లెక్స్లో R J Impex పేరుతో కిరణ్, బల్ సింగ్లు హోల్ సేల్ హోం అప్లియన్సెస్ షాప్ నడుపుతున్నారు. ఇంటర్నేషనల్ కార్పొరేట్ విజిలెన్స్ ఏజెన్సీ ఫిర్యాదుతో వీళ్లు నకిలీ ప్రొడక్ట్స్ అమ్ముతున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది.
మహరాజ్ గంజ్లోని షాప్ గోదాంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు రైడ్ చేశారు. ఒరిజినల్ ప్రొడక్ట్స్ మాదిరి గానే ఉన్న నకిలీ ప్రొడక్ట్స్ను తక్కువ ధరకు విక్రయిస్తూ ఈ కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది. రైడ్స్లో బటర్ ఫ్లై కంపెనీ పేరిట ఉన్న 30 నకిలీ వెట్ గ్రైండర్స్, 64 ఎల్పీజీ స్టవ్స్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. సుమారు ఆరు లక్షలు విలువ చేసే నకిలీ ప్రొడక్ట్స్ను సీజ్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం అప్జల్ గంజ్ పోలీసులకు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు. సిటీలో ఇలా బ్రాండెడ్ పేరు పెట్టి నకిలీ వస్తువులు అమ్మిన ఘటనలు వెలుగుచూడటం కొత్తేం కాదు.
బ్రాండెడ్ పేరుతో ఉన్న నకిలీ గుడ్ నైట్ మస్కిటో లిక్విడ్స్ బాక్స్లు, గుడ్ నైట్ లిక్విడ్ కాయిల్స్, లైజల్ సర్ఫేస్ లిక్విడ్ బాటిల్స్, ఫెవిక్విక్ షీట్స్ అమ్ముతూ బేగంబజార్లో దొరికిపోయారు. ప్రముఖ కంపెనీల బ్రాండ్ నేమ్లతో నకిలీ చాయ్ పత్తా, సర్ఫ్ పౌడర్, సబ్బులు, కొబ్బరి నూనె, ఇతర ప్రొడక్టులను ప్యాక్ చేసి అమ్ముతున్న ముఠాను 2024 ఫిబ్రవరిలో కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. బ్రూక్ బాండ్, రెడ్ లేబుల్, ఎవరెస్ట్ మసాల, ప్యారాచూట్ వంటి బ్రాండ్ల పేరుతో నకిలీ ప్రొడక్టులు తయారు చేసి హోల్ సేల్ దందా చేస్తున్న రాజస్థానీ గ్యాంగ్ను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అప్పట్లో పట్టుకున్నారు. ప్రముఖ కంపెనీల పేర్లతో ప్యాకెట్లు తయారు చేసి.. వాటిని నాసి రకం ప్రొడక్ట్స్ తో ప్యాక్ చేసి హోల్ సేల్, రిటైల్ మార్కెటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.
►ALSO READ | హైదరాబాద్ సిటీ శివార్లలో చిరుత కలకలం.. మంచిరేవులలో కొండపై చిరుత పులి !
హోల్‌సేల్ మార్కెట్‌లో దొరికే నాసిరకం హెయిర్ ఆయిల్ కొనుగోలు చేసి, దానిని రీఫైన్ చేసి.. ప్యారాచూట్ హెయిర్ ఆయిల్‌కు డూప్లికేట్ తయారు చేస్తున్నట్లు కూడా పోలీసుల తనిఖీల్లో తేలింది. సర్ఫ్ ఎక్సెల్, వీల్ సర్ఫ్ పౌడర్, సబ్బులు, కలర్ కెమికల్స్‌తో లైజాల్, హార్పిక్ లిక్విడ్ తయారు చేస్తున్నారు. లేబర్‌కు కూడా అనుమానం రాకుండా ప్యాకింగ్ చేయించేవారు. ఒరిజినల్ కంపెనీలతో పోలిస్తే అంత ఈజీగా గుర్తించే వీలు లేకుండా ప్యాకింగ్ మెటీరియల్ అచ్చుగుద్దినట్లుగా ఉండేలా చూసుకునేవారు. వీటితో నకిలీ ప్రొడక్టులు సిద్ధం చేసి హైదరాబాద్‌లోని హోల్‌సేల్ మార్కెట్స్, రిటైల్స్, కిరాణ షాపులకు సప్లయ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తనిఖీల్లో బయటపడింది.