Job News: హైదరాబాద్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ జాబ్స్.. వివరాలు ఇవే..!

Job News:  హైదరాబాద్ లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ జాబ్స్.. వివరాలు ఇవే..!

హైదరాబాద్ బాలాపూర్​లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్​డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూమెటీరియల్స్(ఏఆర్​సీఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 07.

పోస్టుల సంఖ్య: 41.

పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్– I 06, రీసెర్చ్ అసోసియేట్– III 01, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్) 3‌‌0, సీనియర్ రీసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్) 04. 

ఎలిజిబిలిటీ: జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బి.టెక్, ఎంఈ లేదా ఎంటెక్ లేదా సమాన అర్హత లేదా కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. రీసెర్చ్ అసోసియేట్​కు పీహెచ్​డీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
 
వయోపరిమితి : రీసెర్చ్ అసోసియేట్– Iకు 35 ఏండ్లు, రీసెర్చ్ అసోసియేట్– IIIకు 38 ఏండ్లు, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్)కు 28 ఏండ్లు, సీనియర్ రీసెర్చ్ ఫెలోకు 32 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్లు ప్రారంభం: జులై 28. 

లాస్ట్ డేట్: ఆగస్టు 07. 

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.200. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. 
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు (గేట్/ నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు) జులై 28. గేట్/ నెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకు ఆగస్టు 7న ఎగ్జామ్ నిర్వహిస్తారు.  

పూర్తి వివరాలకు arci.res.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

►ALSO READ | టెన్త్తో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. స్టార్టింగ్ శాలరీనే ఇంత ఉందంటే గ్రేటే..!