
భారత హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. జులై 26 నుంచి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. అప్లికేషన్లకు ఆఖరు తేదీ ఆగస్టు 17.
- పోస్టుల సంఖ్య: 4987 (సెక్యూరిటీ అసిస్టెంట్/ ఎగ్జిక్యూటివ్)
- ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి పదోతరగతి లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
- వయోపరిమితి: 18 నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- శాలరీ: 21,700 నుంచి 69,100.
- అప్లికేషన్ ప్రారంభం: జులై 26.
- అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 650. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.550.
- లాస్ట్ డేట్: ఆగస్టు 19.
- సెలెక్షన్ ప్రాసెస్: మూడంచెల విధానంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టైర్–1లో ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, టైర్–2లో డిస్క్రిప్టివ్ టెస్ట్, టైర్–3లో ఇంటర్వ్యూ/ పర్సనల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పూర్తి వివరాలకు mha.gov.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.
టైర్–1 ఎగ్జామ్
కంప్యూటర్ బేస్డ్ టెస్టులో మల్టిఫుల్ చాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్/ అనలైటికల్/ లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. జనరల్ అవేర్నెస్ 20 ప్రశ్నలు 20 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 20 ప్రశ్నలు 20 మార్కులకు, లాజికల్ రీజనింగ్ 20 ప్రశ్నలకు 20 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ 20 ప్రశ్నలు 20 మార్కులకు, జనరల్ స్టడీస్ 20 ప్రశ్నలు 20 మార్కులకు మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 1/4వ వంతు మార్కులు కోత విధిస్తారు.
టైర్–2 ఎగ్జామ్
డిస్క్రిప్టివ్ ఎగ్జామ్లో పార్ట్–1, పార్ట్–2లు ఉంటాయి. పార్ట్–1లో ట్రాన్స్లేషన్ ఇస్తారు. 500 పదాలను లోకల్ లాంగ్వేజ్లో ఇస్తారు. ఇంగ్లిష్‌లోకి అనువదించాల్సి ఉంటుంది. ఈ పరీక్ష 40 మార్కులకు ఉంటుంది. గంటలో పూర్తి చేయాలి. పార్ట్–2లో స్పోకెన్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. దీనికి 10 మార్కులు కేటాయించారు. మొత్తం 50 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.
టైర్–3 ఎగ్జామ్
ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ 50 మార్కులకు ఉంటుంది.