తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల పోస్టులు భర్తీ.. నోటిఫికేషన్ వివరాలు ఇవే..!

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల పోస్టులు భర్తీ..  నోటిఫికేషన్ వివరాలు ఇవే..!

తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ), ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్(ఐఎంఎస్) విభాగాల్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్​మెంట్ బోర్డు(ఎంహెచ్ఎస్ఆర్​బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 25.

పోస్టులు: డెంటల్ అసిస్టెంట్ సర్జన్(జోన్–1లో 21, జోన్–2లో 27) 
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ(బీడీఎస్) లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. తెలంగాణ డెంటల్ కౌన్సిల్​లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. 
వయోపరిమితి: 2025, జులై 1 నాటికి కనీసం 18 నుంచి 46 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: జులై 14. 
లాస్ట్ డేట్: జులై 25.
సెలెక్షన్ ప్రాసెస్: అకడామిక్ మెరిట్​తోపాటు గవర్నమెంట్ హాస్పిటళ్లలో కాంట్రాక్ట్ లేదా ఔట్​ సోర్స్​డ్​  సేవల ఆధారంగా ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు mhsrb.telangana.gov.in వెబ్​సైట్​లో  సంప్రదించగలరు.