Good Health: భోజనం తరువాత నిద్ర వస్తుందా.. ఆరోగ్యానికి మంచిదికాదు.. మరి ఏం చేయాలో తెలుసా..

Good Health: భోజనం తరువాత నిద్ర వస్తుందా.. ఆరోగ్యానికి మంచిదికాదు.. మరి ఏం చేయాలో తెలుసా..

ఎంత తిన్నా నీరసంగానే  ఉంటుందా.. ఎలాంటి ఆహారం తీసుకున్న ఎలాంటి మార్పు లేదా... అయితే మీరు తినే ఆహారంలోనూ.. తిన్న తరువాత చేసే పనుల్లో కూడా కచ్చితంగా ఛేంజ్ రావాల్సిందే.. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం భోజనంలో ఎలాంటి పదార్దాలు తీసుకోవాలి.. ఏం తినకూడదు.. భోజనం చేసిన తరువాత ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసుకుందాం. . . !

భోజనం చేయడంతో చాలామంది బెడ్డెక్కేస్తారు.  కాని అలా చేయడం వలన  ఆహారం వలన శరీరానికి అందాల్సిన శక్తి అందదని నిపుణులు చెబుతున్నారు.  

భోజనం తర్వాత నిద్రపోవడం:   దాదాపు అందరూ చేస్తున్న పనే ఇదే.  క్షణం గ్యాప్ ఇవ్వరు.. తింటం .. బెడ్డెక్కడం చేసేస్తారు.  సాధరణంగా భోజనం చేసిన తరువాత శరీరం బరువెక్కి అలసట అనిపిస్తుంది.  దీంతో హాయిగా పడుకోవాలనిపిస్తుంది.  దీని వలన ఆరోగ్య పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.  జీవక్రియ సరిగ్గా జరగదు.  దీనివలన అనేక సమస్యలు వస్తాయి... సో భోజనం తరువాత కూడా నీరసంగా ఉంటే  తీసుకునే ఆహారాన్ని తగ్గించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

తిన్న వెంటనే నిద్ర వస్తే.. భోజనం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి.  తీసుకునే ఆహారంలో కొన్ని పదార్దాలను నివారించాలి.  శరీరం జీర్ణక్రియలో బిజీగా ఉంటుంది. దీనివలన 
మెదడుకు రక్త ప్రవాహం తగ్గుతుంది. కార్బోహైడ్రేట్లు ... గ్లూకోజ్ కంటెంట్  అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే    సెరోటోనిన్ ...మెలటోనిన్  హార్మోన్లు ఎక్కువ కావడంతో నిద్రవస్తుంది. ఇలాంటి ఆహారం తీసుకుంటే బరువు పెరిగి.. నీరసంగా ఉంటారు. 

మధ్యాహ్నభోజనంలో వీటిని అస్సలు తినొద్దు..

శుద్ధి చేసిన పిండి పదార్థాలు:  తెల్ల బియ్యంతో వండిన అన్నం,    బ్రెడ్ ..  పిండి పదార్థాలు  ఎక్కువుగా ఉన్న ఆహారాన్ని తింటే శరీరంలో  త్వరగా గ్లూకోజ్  విడుదల అవుతుంది. అప్పుడు  కొద్దిసేపు  రిలాక్స్ గా .. ఉత్సాహంగా.. ఎంతో శక్తిని కలిగి ఉంటాము.  కానీ శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు  హెచ్చు తగ్గుదల ఉంటుంది.  అప్పుడు .. అకస్మాత్తుగా బద్ధకం కలిగి అలసటకు దారితీస్తుంది. 

స్వీట్లు : చాలామందికి భోజనం తరువాత స్వీట్లుతినే అలవాటు ఉంటుంది.  ఏమీ లేకపోతే బెల్లం గడ్డో.. రెండు స్పూన్స్ పంచదార అయినా తింటారు.  ఇది ఆరోగ్యాన్ని చాలా చేటు చేస్తుంది. స్వీట్లలో ఉండే కొవ్వు... గ్లూకోజ్ కంటెంట్ శరీరంలో పేరుకుపోయి నిద్రను కలుగజేస్తాయి.  గ్లూకోజ్ రక్తంలో కలవడం వలన వెంటనే నీరసం వస్తుంది.  సో భోజనం తరువాత ఎట్టి పరిస్థితిలోస్వీట్లు తినకూడదు. 

కూల్ డ్రింక్స్ :  ఫంక్షన్లలో భోజనాల దగ్గర జూస్.. కూల్ డ్రింక్స్  తీసుకుంటారు.  వీటిలో అధికంగా కెఫిన్  .. చక్కెర ఉంటాయి.  ఇలాంటివి కొద్దిసేపు శక్తిని ఇచ్చినా వెంటనే అలసట కలుగుతుంది.  ఇవి కాలేయానికి... మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా ఇబ్బందిని కలుగజేస్తాయి. 

సమోసాలు, పూరీలు, పరాఠాలు :  వీటిని అసలు భోజనంలో తినొద్దు.  కారంగా ఉండే కూరలు ..  వేయించిన ఆహారాలుజీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీని కారణంగా మీరు అలసిపోతారు.

మధ్యాహ్న భోజనంలో తినాల్సినవి ఇవే..

  • నెయ్యితో  తయారు చేసిన  రోటీ  పప్పు...సబ్జీ .. వీటిలో మంచి  ప్రోటీన్ లు ఉంటాయి. 
  • బ్రౌన్ రైస్ ...  క్వినోవా - ఇవి శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి.  వీటిలో శరీరానికి కావలసిన  కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి.
  • మజ్జిగ .. పెరుగు  ఇవి  జీర్ణక్రియకు సహాయపడతాయి.
  • సీజనల్ కూరగాయలు .. సలాడ్లలో  విటమిన్లు...  ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.
  • బొప్పాయి, ఆపిల్ ..  కొబ్బరి నీరు వంటివి శరీరాన్ని హైడ్రేడ్ గా ఉంచుతాయి.