
Aditya Infotech: మార్కెట్ల ఒడిదొడుకులతో ఇన్వెస్టర్లు సేఫ్ లాభాల కోసం ఐపీవోలను మార్గంగా ఎంచుకుంటున్నారు. దీంతో చాలా కాలం తర్వాత తిరిగి ఐపీవోలపై పెట్టుబడిదారులు క్రేజీ బెట్టింగ్స్ వేస్తున్నారు. చాలా ఐపీవోలు ఓపెన్ అయిన గంటల్లోనే ఫుల్ సబ్‌స్క్రిప్షన్ పొందటం దీనిని రుజువు చేస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఆదిత్య ఇన్ఫోటెక్ కంపెనీ ఐపీవో గురించి. రిటైల్ పెట్టుబడిదారుల కోసం ఐపీవో జూలై 29న తెరచుకోనుంది. జూలై 31 వరకు అందుబాటులో ఉండే ఈ ఐపీవోపై అంచనాలు గ్రేమార్కెట్ పెంచేస్తోంది. కంపెనీ తన ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.640 నుంచి రూ.675గా నిర్ణయించింది.
దేశీయ మార్కెట్ల నుంచి రూ.వెయ్యి 300 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఐపీవోలో రూ.500 కోట్లకు కొత్త షేర్ల ఇష్యూ ఉండగా.. మిగిలిన మెుత్తాన్ని ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయానికి ఉంచింది కంపెనీ. ఐపీవో నుంచి వచ్చే మెుత్తంలో రూ.375 కోట్లను కంపెనీ తన రుణ చెల్లింపులను వినియోగించాలని నిర్ణయించింది.
ALSO READ | యాప్ డెవెలపర్లకు రూ. 4 లక్షల కోట్ల ఆదాయం
ఇన్వెస్టర్ గెయిన్ డేటా ప్రకారం ఆగస్టు 5న లిస్టింగ్ కోసం వస్తున్న ఐపీవో ప్రస్తుతం గ్రేమార్కెట్లో మంచి స్పందనను చూస్తోంది. ఒక్కో షేరుపై రూ.176 ప్రీమియం పలుకుతోందని వెల్లడైంది. లిస్టింగ్ తేదీ వరకు ఇది ఇలాగే కొనసాగితే ఒక్కో షేరు రూ.851 రేటు వద్ద 26 శాతం లాభంతో లిస్ట్ అవ్వొచ్చని అంచనాలు ఉన్నాయి.
కంపెనీ వ్యాపారం..
ఆదిత్య ఇన్ఫోటెక్ సంస్థ సీపీ ప్లస్ బ్రాండ్ పేరుతో ఆధునిక భద్రత, నిఘా పరికరాల వ్యాపారంలో ఉంది. అలాగే స్మార్ట్ హోమ్ IoT కెమెరాలు, HD అనలాగ్ సిస్టమ్‌లు, అధునాతన నెట్‌వర్క్ కెమెరాలు, బాడీ-వోర్న్ అండ్ థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, అలాగే లాంగ్-రేంజ్ IR కెమెరాల తయారీ, విక్రయంలో ఉంది.