యాప్ డెవెలపర్లకు రూ. 4 లక్షల కోట్ల ఆదాయం

యాప్ డెవెలపర్లకు రూ. 4 లక్షల కోట్ల ఆదాయం

న్యూఢిల్లీ: గూగుల్​ప్లే, అండ్రాయిడ్​ కోసం యాప్స్​డెవలప్​చేసే వారికి, భారత ఆర్థిక వ్యవస్థకు గత ఏడాది రూ.4 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని  ఎకనామిక్స్, పాలసీ  ఒపీనియన్ రీసెర్చ్ కన్సల్టెన్సీ పబ్లిక్ ఫస్ట్ తాజా రిపోర్ట్ వెల్లడించింది.  భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దదని తెలిపింది.  

ఆండ్రాయిడ్ ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్.  దీనిని స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, టాబ్లెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్ కంప్యూటర్లలో వాడుతారు. గూగుల్ ప్లే అనేది ఆండ్రాయిడ్ సేవలకు అధికారిక యాప్ స్టోర్.  గూగుల్ ప్లే,  ఆండ్రాయిడ్ ద్వారా 35 లక్షల మందికి ఉపాధి దొరికింది. గూగుల్ ప్లేలో 10 లక్షల మంది డెవలపర్లుగా రిజిస్టర్​అయ్యారు. దేశంలోని యాప్ డెవలపర్లలో దాదాపు 79 శాతం మందికి విదేశీ కస్టమర్లు ఉన్నారని పబ్లిక్ ఫస్ట్ తాజా రిపోర్ట్ వెల్లడించింది.