ప్రభుత్వ ఉద్యోగులకు సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ బాతఖాని బంద్.. అరగంటే లంచ్ బ్రేక్

ప్రభుత్వ ఉద్యోగులకు సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ బాతఖాని బంద్.. అరగంటే లంచ్ బ్రేక్
  •     ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో ఉద్యోగులకు సీఎండీ కృష్ణభాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు విధులు నిర్వహించే ఉద్యోగులు ఆఫీస్​ టైంలో సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌లో బాతఖాని బంద్​ చేయాలని హైదరాబాద్​ విద్యుత్​ సౌధలోని ట్రాన్స్‌‌‌‌‌‌‌‌కో ఉద్యోగులకు ఆ సంస్థ సీఎండీ కృష్ణ భాస్కర్​ ఆదేశించారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల మధ్య అరగంటపాటే లంచ్​ బ్రేక్​ తీసుకోవాలన్నారు. ఈ మేరకు బుధవారం సర్క్యులర్​ జారీ చేశారు. ఆ ఉత్తర్వులలో ఇంకా ఏమున్నదంటే.. ‘ఎమెర్జన్సీ అయితే తప్ప పర్సనల్​ ఫోన్లు యూజ్​ చేయరాదు.. ఒకవేళ ఎమర్జన్సీ కాల్స్​ వచ్చినా బిగ్గరగా కాకుండా నెమ్మదిగా మాట్లాడాలి.

తమకు కేటాయించిన సీట్లలో కూర్చొని సమయభావం ప్రకారం పనిచేయాలి. బయట అటు ఇటు తిరగకూడదు’ అని ఆదేశించారు. సంబంధిత డిపార్ట్​మెంట్​ ఉన్నతాధికారులు ఈ విషయాలను తమ సిబ్బందికి తెలియచేసి వారితో పనిచేయించాలని ఆర్డర్లో పేర్కొన్నారు. ఏవైనా ఎలిగేషన్స్​ వస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఎండీ హెచ్చరించారు.