టాప్ స్టార్స్ విజయ్ దేవర కొండ, రష్మిక పెళ్లి ఇవాళే మరికాసేపట్లో జరగనుంది. ఫిబ్రవరి 26న ఉదయం10గంటల 10 నిమిషాలకు ఉదయ్పూర్‌లో హిందూ సాంప్రదాయం ప్రకారం విజయ్, రష్మిక వివాహం జరుగుతుంది. రష్మిక మందన్న కర్ణాటకలోని కొడవ వర్గానికి చెందిన అమ్మాయి కాబట్టి, కొడవ కల్చర్ లో సాయంత్రం 4.30 గంటలకు కొడవ పద్ధతిలో మరోసారి వివాహం జరుగుతుంది. అభిమానులు ప్రేమగా పిలుచుకునే ‘విరోష్’ (VIROSH) జంట ఏడు అడుగులు వేస్తుండటంతో సినీ ఇండస్ట్రీ లుక్ ఈ జంటపై పడింది.
కొడవ పెళ్లి ఎలా జరుగుతుంది?
కొడవ పెళ్లి సంప్రదాయంలో మాంగళ్యధారణ ఉండదని తెలుస్తోంది. అలాగే, పూజారులకు కూడా పెద్దగా ప్రాధాన్యత ఉండదు. పూర్వీకుల ఆశీర్వాదాల ఆధారంగానే ఈ వివాహం జరుగుతుంది. కొడవ పెళ్లిలో ఒడి బియ్యం స్థానంలో వధువు కాయిన్స్ మూట పట్టుకొస్తుంది. ఈ మ్యారేజ్లో పెళ్లి కూతురు తల్లికే ఎక్కువ ప్రాధాన్యత.
అయితే, మన తెలుగు పెళ్లిళ్లు గమనిస్తే, వధువు మెడలో వరుడు మూడు ముళ్లు వేయడం మన హిందూ సంప్రదాయాల ఆచారం. అలా మన కల్చర్ లో మాంగళ్యధారణ అనేది పెళ్ళిలో అత్యంత కీలకమైన ఘట్టం.
అంతేకాకుండా మన దగ్గర ఒడి బియ్యం, తలంబ్రాలు, అక్షింతలు.. అని సందడి ఉంటుంది. కానీ కొడవ పెళ్లిలో ఇలాంటి ఘట్టం కాకుండా.. ఒడి బియ్యం స్థానంలో కాయిన్స్ మూట ఉండటం విశేషం.
ఒడి బియ్యం స్థానంలో కాయిన్స్ మూట
మన దగ్గర వధువు ఒడిలో బియ్యం పోయడం ఆనవాయితీ. కానీ కొడవ సంప్రదాయంలో వధువు ఒక చిన్న నాణేల మూట (coins bundle) పట్టుకొస్తుంది. ఇది సంపద, శుభం, స్థిరత్వానికి సంకేతం.
ఏడు అడుగులు (సప్తపది) లాంటిది ఉండదు
సాంప్రదాయ హిందూ పెళ్లిలా సప్తపది ఉండకపోయినా, వరుడు–వధువు కుటుంబాల అంగీకారంతో వివాహ బంధం స్థిరపడుతుంది.
సాంప్రదాయ వస్త్రధారణ
వధువు: ప్రత్యేకంగా కట్టే కొడవ శైలి చీర, తలపై శాలువా
వరుడు: కొడవ సంప్రదాయ వస్త్రాలు, శాలువా లేదా తలపాగా
అతిథుల హంగామా
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా జరగనున్న ఈ పెళ్లి వేడుక కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విరోష్ వేడుకకు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించింది ఈ జంట. అందులో సినీ సెలబ్రెటీలు ‘పెళ్లి చూపులు’ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్, ‘ఖుషి’ డైరెక్టర్ శివ నిర్వాణ, హీరోయిన్లు ఈషా రెబ్బా, ఆషికా రంగనాథ్, ప్రముఖ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ హాజరయ్యి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే, వీరు ఎంజాయ్ చేస్తున్న హల్దీ, సంగీత్ సెలబ్రేషన్స్ ఫొటోలు, వీడియోలు నెటిజన్లని వీపరీతంగా ఆకట్టుకున్నాయి.
సంగీత్ వేడుకలో 'శ్రీవల్లి' డ్యాన్స్
సంగీత్ వేడుకలో రష్మిక మందన్న తన ప్రదర్శనతో స్టేజ్ పై అలరించారు. తన కాబోయే భర్త విజయ్ కోసం 'పుష్ప 2' చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ 'వీడు మొరటోడు' పాటకు స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రష్మిక డ్యాన్స్ చూసి విజయ్ ముగ్ధుడైపోగా, అతిథులందరూ ఈలలు, కేకలతో హోరెత్తించారు.
