IND vs ENG 2025: పంత్ స్థానంలో జురెల్ బ్యాటింగ్..? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

IND vs ENG 2025: పంత్ స్థానంలో జురెల్ బ్యాటింగ్..? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మాంచెస్టర్ టెస్టులో రిషబ్ పంత్ కుడి కాలి బొటనవేలు విరగడంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరు వారాల పాటు డాక్టర్లు రెస్ట్ అవసరమని భావించడంతో  క్రికెట్ కు దూరం కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో నాలుగో టెస్టుకు టీమిండియా మిగిలిన ఆట కేవలం 10 మందితోనే ఆడబోతుందా.. లేకపోతే పంత్ స్థానంలో ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకోవచ్చా అనే అనే పాత ప్రశ్న తలెత్తింది. పంత్ కాకుండా టీమిండియా స్క్వాడ్ లో ప్రస్తుతం ధృవ్ జురెల్ ఉన్నాడు. పంత్ స్థానంలో జురెల్.. వికెట్ కీపింగ్ మాత్రమే చేయడానికి అనుమతి ఉంటుందా..? లేకపోతే బ్యాటింగ్ కూడా చేయవచ్చా అనే ప్రశ్న క్రికెట్ ఫ్యాన్స్ ను వెంటాడుతుంది.         

ఐసీసీ రూల్స్ ప్రకారం పంత్ బ్యాటింగ్ చేయడానికి రాలేకపోతే అతని స్థానంలో జురెల్ బ్యాటింగ్ చేసే అవకాశం లేదు. ఐసీసీ ప్రస్తుత టెస్ట్ రూల్స్ ప్రకారం, ఒక ఆటగాడు కంకషన్ కు గురైనప్పుడు మాత్రమే ప్రత్యామ్నాయం ఆటగాడిని భర్తీ చేయగలడు. పంత్ గాయం అతని కాలికి సంబంధించింది. తలకు సంబంధించినది కాదు. కాబట్టి జురెల్ ఫీల్డింగ్ ప్రత్యామ్నాయం మాత్రమే. అతను  కీపింగ్ చేయడానికి మాత్రమే ఉంటుంది. బ్యాటింగ్ చేయడానికి అర్హత లేదు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 10 మందితోనే ఆడబోతుంది. 

►ALSO READ | IND vs ENG 2025: టీమిండియాకు బిగ్ షాక్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి పంత్ ఔట్

నాలుగో టెస్ట్ తొలి రోజు ఆటలో భాగంగా మూడో సెషన్‎లో పంత్ పదానికి తీవ్ర గాయమైంది. వోక్స్ వేసిన ఇన్నింగ్స్ 68 ఓవర్ మూడో బంతికి రివర్స్ స్వీప్ ఆడడానికి ప్రయత్నించే క్రమంలో ఈ బాధాకర సంఘటన చోటు చేసుకుంది. కుడి పాదం వాయడంతో పాటు కొంచెం రక్తం కూడా వచ్చింది. ఫిజియో వచ్చి వైద్యం చేసినప్పటికీ పంత్ నడవలేకపోవడంతో అతడు మైదానాన్ని వీడాడు. పంత్ రిటైర్డ్ హార్ట్‎గా వెళ్లిపోవడంతో అతని స్థానంలో జడేజా బ్యాటింగ్‎కు వచ్చాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 83 ఓవర్లలో 264/4 స్కోరు చేసింది. జడేజా (19 బ్యాటింగ్‌‌), శార్దూల్‌‌ ఠాకూర్‌‌ (19 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు.