IND vs ENG 2025: వివాదాస్పద క్యాచ్‌కు జడేజా ఔట్.. ఇంగ్లాండ్‌కు అనుకూలంగా అంపైర్ నిర్ణయం

IND vs ENG 2025: వివాదాస్పద క్యాచ్‌కు జడేజా ఔట్.. ఇంగ్లాండ్‌కు అనుకూలంగా అంపైర్ నిర్ణయం

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మాంచెస్టర్ టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా క్యాచ్ వివాదాస్పదమవుతోంది. రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఆరంభంలోనే జడేజా వికెట్ కోల్పోయింది. 4 వికెట్ల నష్టానికి 264 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన గిల్ సేనకు ఆర్చర్ బిగ్ షాక్ ఇచ్చాడు. 84 ఓవర్ ఐదో బంతికి ఒక ఔట్ స్వింగ్ తో జడేజాను బోల్తా కొట్టించాడు. ఆర్చర్ అద్భుత బౌలింగ్ కు జడేజా బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడంతో స్లిప్ లో బ్రూక్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఈ క్యాచ్ వివాదాస్పదమవుతోంది. బ్రూక్ సరిగా క్యాచ్ అందుకోలేదనే వాదనలు నెటిజన్స్ నుంచి వినిపిస్తున్నాయి. క్యాచ్ అందుకునే క్రమంలో బంతిని కింత పెట్టినట్టు ఒక యాంగిల్ లో అర్ధమవుతోంది. ఆన్-ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చినప్పటికీ.. రీప్లేలు కొంత అస్పష్టతను ఇచ్చాయి. కొంతమంది బంతిని బ్రూక్ సరిగా అందుకోవడంలో విఫలమయ్యాడని.. బంతి నేలను తాకి ఉండవచ్చని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే జడేజా ఔట్ కావడంతో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. ఈ సిరీస్ లో సూపర్ ఫామ్ లో ఉన్న జడేజా 20 పరుగులకే పెవిలియన్ కు చేరాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు రెండో రోజు లంచ్ సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. క్రీజ్ లో  వాషింగ్ టన్ సుందర్ (20), పంత్ (39) ఉన్నారు. 4 వికెట్ల నష్టానికి 264 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన గిల్ సేన ప్రారంభంలోనే జడేజా వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో సుందర్, ఠాకూర్ కలిసి 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. లంచ్ కు ముందు 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శార్దూల్ ఔట్ కావడంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. 

►ALSO READ | IND vs ENG 2026: ఇంగ్లాండ్ టూర్‌కు ఇండియా.. వన్డే, టీ20 సిరీస్‌కు షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

తొలి రోజు సాయి సుదర్శన్‌‌ (61), యశస్వి జైస్వాల్‌‌ (58) హాఫ్‌‌ సెంచరీలకు తోడు కేఎల్‌‌ రాహుల్‌‌ (46), రిషబ్‌‌ పంత్‌‌ (37 రిటైర్డ్‌‌హర్ట్‌‌) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. డాసన్, ఆర్చర్, వోక్స్ తలో వికెట్ తీసుకున్నారు.