IND vs ENG 2026: ఇంగ్లాండ్ టూర్‌కు ఇండియా.. వన్డే, టీ20 సిరీస్‌కు షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

IND vs ENG 2026: ఇంగ్లాండ్ టూర్‌కు ఇండియా.. వన్డే, టీ20 సిరీస్‌కు షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ

భారత క్రికెట్ జట్టు 2026లో వైట్-బాల్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌లో టూర్ కు వెళ్లనుంది. ఇందులో భాగంగా మొత్తం 8 మ్యాచ్ లు ఆడనుంది. మొదట 5 టీ20 మ్యాచ్ లు ఆ తర్వాత 3 వన్డేలు జరగనున్నాయి. ఈ టూర్ లో ఇండియా, ఇండియా ఆడబోయే షెడ్యూల్ ను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు గురువారం (జూలై 24) రిలీజ్ చేసింది. బీసీసీఐ గురువారం ప్రకటించిన ఈ షెడ్యూల్ జూలై 1న ప్రారంభమవుతుంది. జూలై 19న జరగబోయే చివరి వన్డేతో ఈ టూర్ ముగుస్తుంది.

జూలై 1న డర్హామ్‌లో తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. జూలై 4, జూలై 7, జూలై 9, జూలై 11 న వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ 20 మ్యాచ్ లు జరుగుతాయి. మాంచెస్టర్, నాటింగ్ హోమ్, బ్రిస్టల్, సౌతాంప్టన్‌ వేదికలుగా ఈ మ్యాచ్ లు జరుగుతాయి. జూలై 14 నుంచి 19 మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది. మూడు వన్డేలు బర్మింగ్‌హామ్, కార్డిఫ్, లండన్‌లో జరుగుతాయి. ప్రస్తుతం టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడుతూ ఇంగ్లాండ్ లోనే ఉంది. ఇంగ్లాండ్ తో 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ముగించుకొని ఆ తర్వాత అక్టోబర్ లో వెస్టిండీస్ తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడనుంది.

2026 ఇంగ్లాండ్‌ టూర్ కు టీమిండియా షెడ్యూల్: 

జూలై 1: మొదటి టీ20 – బ్యాంక్స్ హోమ్స్ రివర్‌సైడ్, డర్హామ్, రాత్రి 11 గంటలకు 

జూలై 4: 2వ టీ20 - ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్, రాత్రి 7 గంటలకు
 
జూలై 7: 3వ టీ20 – ట్రెంట్ బ్రిడ్జ్, నాటింగ్‌హామ్, రాత్రి 11 గంటలకు 

జూలై 9: 4వ టీ20 - సీట్ యునిక్ స్టేడియం, బ్రిస్టల్, రాత్రి 11 గంటలు

జూలై 11: 5వ టీ20 – యుటిలిటా బౌల్, సౌతాంప్టన్, రాత్రి 11 గంటలు
 
జూలై 14: మొదటి వన్డే - ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్, సాయంత్రం 5:30

జూలై 16: రెండవ వన్డే - సోఫియా గార్డెన్స్, కార్డిఫ్, సాయంత్రం 5:30
 
జూలై 19: మూడవ వన్డే - లార్డ్స్, లండన్, మధ్యాహ్నం 3:30 

మెన్స్ తో పాటు టీమిండియా ఉమెన్స్ సైతం వచ్చే ఏడాది ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లనున్నారు. ఉమెన్స్ టూర్ లో భాగంగా ఇంగ్లాండ్ మహిళలతో మన మహిళల జట్టు మూడు టీ 20 మ్యాచ్ లు ఒక టెస్ట్ ఆడతారు. 2026లో మే 28 నుంచి జూన్ 2 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ జూలై 10 న లార్డ్స్ లో జరగనుంది. 

►ALSO READ | IND vs ENG 2025: హార్ట్ టచింగ్ సీన్.. జట్టు కోసం పెయిన్ కిల్లర్స్‌తో బరిలోకి దిగిన పంత్

భారత మహిళల ఇంగ్లాండ్ పర్యటన 2026 షెడ్యూల్

మే 28: మొదటి టీ20- అంబాసిడర్ క్రూయిస్ లైన్ గ్రౌండ్, చెల్మ్స్‌ఫోర్డ్, రాత్రి 11 గంటలు 

మే 30: రెండవ టీ20 - సీట్ యునిక్ స్టేడియం, బ్రిస్టల్

జూన్ 2: 3వ టీ20 – ది కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్, టౌంటన్, రాత్రి 11 గంటలకు

జూలై 10: మొదటి టెస్ట్ - లార్డ్స్, లండన్, మధ్యాహ్నం 3:30