
మాంచెస్టర్ టెస్టులో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కు తొలి రోజు కుడి కాలి వేలికి తీవ్ర గాయం కావడంతో ఆరు వారాల రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించిన సంగతి తెలిసిందే. దీంతో పంత్ సిరీస్ మొత్తానికి దూరమవుతాడనే ప్రచారం జరిగింది. తొలి రోజు నొప్పితో విల విల్లాడిన పంత్ బ్యాటింగ్ చేయడం అసాధ్యమనే అనుకున్నారు. అయితే జట్టు కోసం పంత్ డెడికేషన్ కు హ్యాట్సాఫ్ చెప్పాలిందే. టీమిండియా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెబుతూ పంత్ రెండో రోజు బ్యాటింగ్ కు వచ్చాడు. రెండో రోజు ఆటలో భాగంగా శార్దూల్ ఠాకూర్ ఔట్ కావడంతో పంత్ 8 వ స్థానంలో బ్యాటింగ్ కొనసాగించాడు.
ALSO READ | IND vs ENG 2025: పంత్ స్థానంలో జురెల్ బ్యాటింగ్..? ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?
జట్టు కోసం పెయిన్ కిల్లర్స్ తో బరిలోకి దిగడంతో స్టేడియంలో ఫ్యాన్స్ పంత్ ను చప్పట్లతో గౌరవించారు. బ్యాటింగ్ చేసిన పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేవు. పంత్ స్థానంలో ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపడతారు. మూడో టెస్టులోనూ పంత్ చేతి వేలికి గాయం కావడంతో జురెల్ కీపింగ్ చేశాడు. 37 పరుగులతో బ్యాటింగ్ కు దిగిన పంత్.. ప్రస్తుతం 39 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో వర్షం పడడంతో అంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే రెండో రోజు రెండో రోజు లంచ్ సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. క్రీజ్ లో వాషింగ్ టన్ సుందర్ (20), పంత్ (39) ఉన్నారు. 4 వికెట్ల నష్టానికి 264 పరుగులతో రెండో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన గిల్ సేన ప్రారంభంలోనే జడేజా వికెట్ కోల్పోయింది. ఆర్చర్ బౌలింగ్ లో జడేజా బ్యాట్ ఎడ్జ్ తీసుకోవడంతో స్లిప్ లో బ్రూక్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కు పెవిలియన్ కు చేరాల్సి వచ్చింది. ఈ సమయంలో సుందర్, ఠాకూర్ కలిసి 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నారు.
లంచ్ కు ముందు 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శార్దూల్ ఔట్ కావడంతో టీమిండియా ఆరో వికెట్ కోల్పోయింది. తొలి రోజు సాయి సుదర్శన్ (61), యశస్వి జైస్వాల్ (58) హాఫ్ సెంచరీలకు తోడు కేఎల్ రాహుల్ (46), రిషబ్ పంత్ (37 రిటైర్డ్‌హర్ట్) రాణించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్ మూడు వికెట్లు పడగొట్టాడు. డాసన్, ఆర్చర్, వోక్స్ తలో వికెట్ తీసుకున్నారు.
Rishabh Pant is hobbling out to a standing ovation from the Old Trafford crowd! 🤯 pic.twitter.com/I1vZ1MLR16
— Sky Sports Cricket (@SkyCricket) July 24, 2025