
హైదరాబాద్: స్నేహితురాళ్లతో కలిసి గచ్చిబౌలిలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న ఖమ్మంకు చెందిన యామిని అనే 27 ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పని చేస్తున్న చింతల యామిని రూమ్లో ఎవరు లేని సమయంలో కిటికీ గ్రిల్కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆఫీస్కి వెళ్ళిన ఆమె స్నేహితులు సాయంత్రం గదికి వచ్చి చూడగా కిటికీ గ్రిల్కు ఉరివేసుకొని ఉన్న స్థితిలో యామిని కనిపించడంతో ఆమె ఫ్రెండ్స్ షాకయ్యారు. యామిని స్నేహితులు, హాస్టల్ నిర్వాహకులు గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని యామిని ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగంలో పని ఒత్తిడి కారణంగా ఆమె ఇలాంటి నిర్ణయం తీసుకుందో లేక వ్యక్తిగత సమస్యలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు మొదలైంది. అయితే.. యామిని సొంతూరు వెళ్లేందుకు మంగళవారం ఉదయం కాచిగూడ రైల్వే స్టేషన్కు వెళ్లినట్లు తెలిసింది.
►ALSO READ | తండ్రి మర్డర్.. తల్లిని పట్టించిన మూడేళ్ల కూతురు..!
ఖమ్మం పట్టణం గాంధీనగర్కు చెందిన చింతల యామిని(27) గచ్చిబౌలి ఇందిరానగర్లోని ఓ పీజీ హాస్టల్లో ఉంటూ ఐటీ జాబ్ చేస్తోంది. ఊరెళ్లేందుకు కాచిగూడ స్టేషన్కు వెళ్లిన ఆమెకు వాంతులు అవ్వడంతో తిరిగి హాస్టల్కు వెళ్లింది. చున్నీతో గ్రిల్కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. కాల్ డేటాతో ఈ ఆత్మహత్యకు కారణం ఏంటనే విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.