తండ్రి మర్డర్.. తల్లిని పట్టించిన మూడేళ్ల కూతురు..!

తండ్రి మర్డర్.. తల్లిని పట్టించిన మూడేళ్ల కూతురు..!

మూడుముళ్ల బంధానికి విలువ రోజురోజుకూ తగ్గిపోతోంది. చాలా మంది మహిళలు తమ భర్తలను చంపుతున్న కేసులు ఇటీవల భారీగా పెరిగాయి. అయితే ప్రధానంగా వివాహేతర సంబంధాలే కాపురాలను కూల్చుతున్నట్లు చివరికి తేలుతోంది.

తమిళనాడులో భర్తను హత్య చేయించిన భార్య వ్యవహారం పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చింది. వేలూరు జిల్లాకు చెందిన భరత్ తన గ్రామంలోని నందిని అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే వృత్తి రీత్యా వంట మాస్టర్ అయిన భరత్ చెన్నైలోని ఒక హోటల్ లో పనిచేస్తూ.. వారాంతంలో ఇంటికి వస్తుండేవాడు. ఈ క్రమంలోనే నందినికి సంజయ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. 

ఎప్పటిలాగానే ఈనెల 21న భరత్ వారాంతంలో భార్యా బిడ్డల దగ్గరకు వచ్చాడు. దీనినే సరైన సమయంగా భావించిన లవర్స్.. భరత్ అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయ్యారు. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు నందిని సహాయం చేసింది. ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది.  ఇంట్లో అవసరమైన సరుకుల కోసం భార్య, చిన్న కుమార్తెతో కలిసి షాపుకు వెళ్లాడు. షాపింగ్ ముగించి ఇంటికి వస్తున్న దారి మధ్యలో రోడ్డుకు అడ్డంగా కొబ్బరి మట్టలు ఉండటంతో అదుపుతప్పింది భరత్ బైక్. ముందుగానే ప్రియుడికి నందిని సమాచారం ఇవ్వటంతో సంజయ్ స్పాట్ దగ్గర మాటువేసుకుని ఉన్నాడు. వెంటనే భరత్ పై దాడి చేసి పారిపోయాడు.

Also Read:-హైదరాబాద్ జీడిమెట్లలో ప్రేమోన్మాది వీరంగం.. సూపర్ మార్కెట్ లో కత్తి కొని.. యువతిపై దాడికి స్కెచ్..

అయితే ఎవరు ఇదంతా చేశారనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు భార్య నందిని పొంతన లేని సమాధానాలు ఇచ్చింది. దీంతో ఆ సమయంలో తండ్రితో వెంట వెళ్లిన మూడేళ్ల చిన్న కుమార్తెను పోలీసులు ప్రశ్నించగా డాడీని చంపింది సంజయ్ మామ అంటూ బదులిచ్చింది. భరత్ గతంలోనే సంజయ్ తో అక్రమ సంబంధంపై నందినిని మానుకోవాలని సూచించాడని, దీనిపై కొన్నిసార్లు వారిద్దరి మధ్య గొడవ కూడా జరిగినట్లు దర్యాప్తులో పోలీసులు కనుగొన్నారు. భరత్ హత్యకు నందిని, సంజయ్ కలిసి ప్లాన్ వేశారని వారు గుర్తించారు. దీంతో చిన్న కుమార్తె ఇచ్చిన సమాచారం మర్డర్ మిస్టరీ చేధించటానికి వీలైందని పోలీసులు చెప్పారు. నింధితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.