మంచు విష్ణు మరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రావణుడి కోణం నుంచి 'రామాయణం'.. ఆ స్టార్ హీరోలతో!

 మంచు విష్ణు మరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రావణుడి కోణం నుంచి 'రామాయణం'..  ఆ స్టార్ హీరోలతో!

ఇటీవల భారతీయ సినిమాలు  పురాణాలు, ఇతిహాసాలతో ముడిపడిన కథాంశాలతో వస్తున్నాయి. ముఖ్యంగా రామాయణంపై సినీ నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ ( Prabhas ) రామునిగా 2023లో ఓం రౌత్ రూపొందించిన 'అదిపురుష్ '  ( Adipurush ) బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా..  రామాయణాన్ని తమదైన శైలిలో తెరకెక్కించేందుకు పలువురు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.  నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రామాయణం' ( Ramayana ) చిత్రం రెండు భాగాలుగా చీత్రీకరణ జరుగుతోంది.  ఈమూవీలో రణ్ బీర్ కపూర్ ( Ranbir Kapoor ) , సాయి పల్లవి ( Sai Pallavi) , యష్  ( Yash )  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2026 దీపావళికి విడుదల కానుంది. ఈనేపథ్యంలో మరో ఆసక్తికరమైన పౌరాణిక చిత్రం తెరపైకి వచ్చింది.

ఇటీవల మంచు విష్ణు (  Vishnu Manchu ) ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి వివరించారు.  రావణుడి జీవితం ఆధారంగా తాను 2009లోనే ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నానని తెలిపారు. ఇది రామాయణాన్ని రావణుడి కోణం నుంచి చెప్పే ఒక వినూత్నమైన కథ అని చెప్పారు. రావణుడి పుట్టుక నుంచి మరణం వరకు సాగుతుందని వివరించారు.  అప్పట్లో రాముడి పాత్రను చేయమని తమిళ నటుడు సూర్య ( Suriya ) ను సంప్రదించామని విష్ణు తెలిపారు.  ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు ( K. Raghavendra Rao )ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నారు. డైలాగ్స్, స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉన్నాయి. రావణుడి పాత్రను మోహన్ బాబు ( Mohan Babu )  చేయాల్సి ఉంది. అయితే, ఆర్థికపరమైన పరిమితుల వల్ల అది కార్యరూపం దాల్చలేదు అని వివరించారు.

►ALSO READ | Vijay Deverakonda: 'కింగ్‌డమ్'‌ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్!

తన డ్రీమ్ ప్రాజెక్టులో సీత పాత్రకు అలియా భట్ ( Alia Bhatt )ను, రాముడి పాత్రకు సూర్యను తీసుకోవాలనే తన కోరిక అని విష్ణు తెలిపారు.. స్వయంగా హనుమంతుడి పాత్రను పోషించాలని తాను ఆసక్తిగా ఉన్నానని చెప్పగా, రాఘవేంద్ర రావు మాత్రం వేరే ఆలోచనతో ఇంద్రజిత్ పాత్రను సూచించారట. ఇప్పుడు ఆ పాత్రకు సూర్య సోదరుడు కార్తీ ( Karthi ) మరింత బాగా సరిపోతాడని  భావిస్తున్నట్లు ఆయన వివరించారు. జటాయువుగా సత్యరాజ్ ( Sathyaraj) , లక్షణుడిగా కల్యాణ్ రామ్ ( Kalyan Ram ) తీసుకోవాలని కోరుకుంటున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. బడ్జెట్ వల్ల ఇది కార్యరూపం దాల్చలేదని చెప్పుకొచ్చారు. 

ఇటీవల 'కన్నప్ప' చిత్రంలో  మంచు విష్ణు ప్రధాన పాత్ర పోషించారు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ వంటి భారీ తారాగణంతో రూపొందినప్పటికీ, 'కన్నప్ప' బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 41.75 కోట్లు మాత్రమే వసూలు చేసి అంచనాలను అందుకోలేకపోయింది. అభిమానులను నిరాశపరిచింది. మరి మంచు విష్ణు రెండో డ్రీమ్ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతోందో చూడాలి.