
ప్రభుత్వ దవాఖాన్లలో రోగికిచ్చే మందుల వివరాలను ఆన్‌లైన్ చేయడం సోమవారం నుంచి ప్రారంభమైంది. ప్రతి దవాఖానలో ఇదే పద్ధతి పాటించనున్నారు. ఈ ఔషధి పోర్టల్‌లో లాగిన్ అవడానికి ప్రతి దవాఖానకు ఒక లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ ఇచ్చారు. వీటి ద్వారా రోగికిచ్చిన ప్రతి ట్యాబ్లెట్ వివరాలనూ పోర్టల్‌లో నమోదు చేయాలి. ఇకపై రోగులకు రెండు మందుల చీటీలు ఇస్తారు. ఒకటి ఫార్మసిస్ట్ దగ్గరే ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్న టైంలో మందులిచ్చి రోగులను పంపించేసి, రెండో చిట్టీ సాయంతో ఆన్‌లైన్ లో నమోదు చేస్తారు. జులై ఫస్ట్నుంచి ఈ పద్ధతిని తప్పనిసరి చేశారు. ఓపీ, ఐపీ రోగుల సంఖ్య, అందుబాటులో ఉన్న మందుల వివరాలను ఎస్‌ఎంఎస్ ద్వారా జిల్లా వివరాలను డీఎంహెచ్‌వోలకు పంపిస్తారు.