డ్రగ్‌‌‌‌ స్టోరేజీ సెంటర్ల నుంచి మెడిసిన్స్‌‌‌‌ మాయం

డ్రగ్‌‌‌‌ స్టోరేజీ సెంటర్ల నుంచి మెడిసిన్స్‌‌‌‌ మాయం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లకు సప్లై చేయాల్సిన మెడిసిన్స్‌‌‌‌ను కొంత మంది సిబ్బంది ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారు. పేషెంట్లకు ఇచ్చినట్టుగా చూపిస్తూ, వాటిని ప్రైవేటు డ్రగ్‌‌‌‌ ఏజెన్సీలకు, మెడికల్ షాపులకు విక్రయిస్తున్నారు. డ్రగ్‌‌‌‌ కంట్రోల్ అథారిటీ అధికారులు ఇటీవల హైదరాబాద్‌‌‌‌లోని అంబర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌లో ఉన్న ఓ గోడౌన్‌‌‌‌పై జరిపిన దాడుల్లో ఈ విషయం బయటపడింది. 

స్టేట్ మెడికల్ కార్పొరేషన్‌‌‌‌(టీఎస్‌‌‌‌ఎంఎస్‌‌‌‌ఐడీసీ) కొనుగోలు చేసి, ప్రభుత్వ హాస్పిటళ్లకు సప్లై చేసిన ట్యాబ్లెట్స్‌‌‌‌ ఈ గోడౌన్‌‌‌‌లో ఉన్నట్టు వారు గుర్తించి, వాటిని సీజ్ చేశారు. ఇందులో అజిత్రోమైసిన్‌‌‌‌, అమాగ్జిలిన్‌‌‌‌ క్యాప్యుల్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ల బ్యాచ్ నంబర్ల ఆధారంగా డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఎంక్వైరీ చేస్తోంది. ప్రభుత్వ దవాఖాన్లకు అవసరమైన అన్ని మందులను, మెడికల్ కార్పొరేషన్ కొనుగోలు చేసి జిల్లాల్లోని స్టోరేజ్ సెంటర్లకు తరలిస్తుంది. 

అక్కడి నుంచి హాస్పిటళ్లకు సరఫరా చేస్తుంది. భారీ మొత్తంలో అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్లు (బ్యాచ్ నంబర్ 0010) కొనుగోలు చేసిన కార్పొరేషన్, వాటిని నల్గొండ, హైదరాబాద్‌‌‌‌, వరంగల్‌‌‌‌లోని సెంట్రల్ డ్రగ్ స్టోరేజ్ సెంటర్లకు తరలించింది. ఈ మూడు స్టోర్ల నుంచి మొత్తం 76 దవాఖాన్లకు మెడిసిన్‌‌‌‌ను సప్లై చేయాల్సి ఉండగా, భారీ మొత్తంలో ట్యాబ్లెట్లు హైదరాబాద్‌‌‌‌లోని గోడౌన్‌‌‌‌లో పట్టుబడ్డాయి. అలాగే, నిజామాబాద్, సిద్దిపేట, వరంగల్‌‌‌‌లోని సెంట్రల్ డ్రగ్ స్టోరేజ్ సెంటర్ల నుంచి అమాగ్జిలిన్ ట్యాబ్లెట్లు (బ్యాచ్ నంబర్ 3206) పక్కదారి పట్టినట్టు అధికారులు చెబుతున్నారు.