ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు.. నల్లకుంటలో మెడికల్ షాపు లైసెన్స్ సస్పెన్షన్

ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు.. నల్లకుంటలో మెడికల్ షాపు లైసెన్స్ సస్పెన్షన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న శ్రీసాయి దుర్గా మెడికల్స్ లైసెన్స్​ను డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు ఏడు రోజుల పాటు సస్పెండ్ చేశారు. డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే మత్తు కలిగించే మందులు అమ్ముతున్నట్లు, షాపులో హెచ్1 డ్రగ్ రిజిస్టర్ మెయింటెన్ చేయడం లేదని అంబర్​పేట్ డ్రగ్ ఇన్​స్పెక్టర్ గోవింద్ సింగ్ తనిఖీల్లో గుర్తించారు. 

దీనిపై షోకాజ్ నోటీసు జారీ చేయగా, షాపు నిర్వాహకుడు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఇన్​స్పెక్టర్ నివేదిక ఆధారంగా సికింద్రాబాద్ డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఏడు రోజుల పాటు షాపు లైసెన్స్ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.