వరంగల్ ‘మెడికవర్’లో స్టమక్ క్యాన్సర్ కు అరుదైన చికిత్స

వరంగల్ ‘మెడికవర్’లో స్టమక్ క్యాన్సర్ కు అరుదైన చికిత్స

హనుమకొండ, వెలుగు: ప్రాణాంతక కడుపు క్యాన్సర్ తో బాధపడుతున్న 55 ఏండ్ల వ్యక్తికి అత్యంత క్లిష్టమైన ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా నిర్వహించినట్లు వరంగల్ మెడికవర్ హాస్పిటల్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ డా.సునీల్ నాగుల తెలిపారు. సోమవారం మెడికవర్ హాస్పిటల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 

కొద్దివారాలుగా కడుపునొప్పితో సఫర్ అవుతున్న ఓ వ్యక్తి హాస్పిటల్ కు వచ్చాడని, దీంతో ఆయన ఎండోస్కోప్, సీటీస్కాన్ చేసి స్టమక్ క్యాన్సర్ ఉన్నట్లు ప్రారంభ దశలోనే గుర్తించామన్నారు. అనంతరం గ్యాస్ట్రో ఇంటెస్టెనల్ క్యాన్సర్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించామన్నారు. 

మెడికవర్ హాస్పిటల్ లో స్టమక్, లివర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్లను అత్యాధునిక సౌకర్యాలతో చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ ద్వారా బలహీనవర్గాలకూ క్యాన్సర్ వైద్యం అందిస్తున్నట్లు ఆయన వివరించారు