తల్లి పాత్ర చేయడంపై మీనాక్షి చౌదరి ఏం చెప్పిందంటే..

తల్లి పాత్ర చేయడంపై మీనాక్షి చౌదరి ఏం చెప్పిందంటే..

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్‌‌‌‌‌‌‌‌ బిజీగా ఉంది మీనాక్షి చౌదరి. దుల్కర్ సల్మాన్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆమె నటించిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్ సంస్థ  నిర్మించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి చెప్పిన విశేషాలు.

‘‘ఇదొక కామన్ మ్యాన్ కథ.  బ్యాంకింగ్ నేపథ్యంలో కొన్ని సిరీస్‌‌‌‌‌‌‌‌లు వచ్చాయి కానీ ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో కూడిన  బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది. భాస్కర్ దగ్గర ఏమీ లేనప్పుడు తనని తనగా ఇష్టపడుతుంది సుమతి. ప్రేమను పంచే కుటుంబం, బతకడానికి అవసరమైనంత డబ్బు ఉంటే చాలు అనుకునే స్వభావం తనది. అయితే దురాశ, డబ్బు కారణంగా భాస్కర్-సుమతి మధ్య ఏం జరిగింది అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్ట్ టైమ్‌‌‌‌‌‌‌‌ తల్లి పాత్రలో నటించడం చాలెంజింగ్‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. అయితే మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే కావడంతో నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకొని, అందుకు తగ్గట్టుగా పాత్రలో ఒదిగిపోయా. దుల్కర్ ఈ  కథను తన భుజాలపై నడిపించారు.

తెలుగు మాతృ భాష కానప్పటికీ, డైలాగ్స్  నేర్చుకొని చక్కగా చెప్పారు. ‘గుంటూరు కారం’ తర్వాత సితార బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇది నా రెండో సినిమా. ఇది నాకు హోమ్ బ్యానర్ లాంటిది.  ఇక  కెరీర్ స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో తల్లి పాత్ర చేయడం రిస్క్ అనిపించలేదు.  వయసుకు తగ్గ పాత్రలే చేయాలనే పరిమితిని నటులు పెట్టుకోకూడదు. ఒకే తరహా పాత్రలు చేస్తే ప్రేక్షకులకు కూడా బోర్ కొడుతుంది. అందుకే నటిగా పాత్రల ఎంపికలో వైవిధ్యం చూపించాలని అనుకుంటున్నా. ఈ సినిమాతో నటిగా నాకు  మంచి గుర్తింపు వస్తుందని, మరిన్ని మంచి కథలు వస్తాయని భావిస్తున్నా. ప్రస్తుతం  మట్కా, మెకానిక్ రాకీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. వెంకటేష్, అనిల్ రావిపూడి గారి సినిమాలో నటిస్తున్నా.’’.