టాలీవుడ్ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్ లో ఉంది. గతేడాది సంక్రాంతికి 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు మరోసారి పండగ బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన 'అనగనగా ఒక రాజు' రేపు ( జనవరి 14, 2026) థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మీనాక్షి చేసిన సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తన పెళ్లి, కాబోయే భర్త లక్షణాల గురించి ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి.
నా 'రాజు'కి ఆ అర్హతలు ఉండాల్సిందే!
సాధారణంగా హీరోయిన్లు తమకు కాబోయే భర్త అందంగా ఉండాలని, తనను బాగా చూసుకోవాలని చెబుతుంటారు. కానీ మీనాక్షి మాత్రం వెరైటీగా ఒక పెద్ద లిస్టే బయటపెట్టింది. నాకు కాబోయే వాడు నటుడు, డాక్టర్, మిస్టర్ ఇండియా అస్సలు అవ్వకూడదు. ఎందుకంటే నేను ఇప్పటికే ఆ మూడు రంగాల్లో ఉన్నాను . ఇంట్లో మళ్ళీ అవే ప్రొఫెషన్లు ఉంటే బోర్ కొడుతుంది. అందుకే ఇంట్లో మరో నటుడో, డాక్టరో నాకు వద్దు అంటూ షాకిచ్చింది.
క్వాలిఫికేషన్లు లిస్ట్..
తనను పెళ్లి చేసుకునే వ్యక్తికి ఉండాల్సిన క్వాలిఫికేషన్లు లిస్ట్ పెద్దగానే చెప్పింది. అతనికి కనీసం 100 ఎకరాల పొలాలు ఉండాలి. వంట చేయడం, బట్టలు ఉతకడం, ఐరన్ చేయడం వంటి పనులన్నీ అతనే చూసుకోవాలి. రోజుకు మూడు సార్లు గిఫ్టులు ఇచ్చేంత ప్రేమ ఉండాలి. అతనికి గతంలో మూడు నాలుగుబ్రేకప్స్ ఉన్నా నాకు అభ్యంతరం లేదు. కానీ నాకంటే హైట్ ఎక్కువగా ఉండాలని తన మనసులో మాట చెప్పేసింది. దీంతో ఈ వీడియో నెట్టింత తెగ వైరల్ అవుతోంది. ఈ కామెంట్స్ విన్న నెటిజన్లు మీరు వెతుకుతున్నది భర్తన లేక ఆల్‌రౌండర్ అసిస్టెంట్‌నా? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
'అనగనగా ఒక రాజు'
నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీకి మీనాక్షి గ్లామర్ తోడైతే ఎలా ఉంటుందో ఈ చిత్రం చూపిస్తుందని మూవీ మేకర్స్ ధీమాగా ఉన్నారు.. పెళ్లి చుట్టూ తిరిగే కథతో, ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ రూపొందింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో, ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా?
సమంత తర్వాత టాలీవుడ్‌లో అంతటి వేగంగా క్రేజ్ సంపాదించుకున్న మీనాక్షికి సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసి వస్తోంది. 'మహేష్ బాబు తో 'గుంటూరు కారం', వెంకటేష్ తో 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలతో ఇప్పటికే తన సత్తా చాటిన ఈ డాక్టర్ కమ్ యాక్ట్రెస్, 'అనగనగా ఒక రాజు'తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. మకి బాక్సాఫీస్ వద్ద ఈ 'రాజు' చేసే సందడి ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!
