ఏ అంశాన్నీ దాచలేదు..అడగని వివరాలు ఎట్లిస్తరు?: మీనాక్షి నటరాజన్‌‌ 

ఏ అంశాన్నీ దాచలేదు..అడగని వివరాలు ఎట్లిస్తరు?: మీనాక్షి నటరాజన్‌‌ 

న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యసభ ఎన్నికల అఫిడవిట్‌‌లో తాను ఏ ఒక్క అంశాన్నీ దాచలేదని, పూర్తి పారదర్శకతతోనే వివరాలను సమర్పించానని తెలంగాణ కాంగ్రెస్ ఇన్​చార్జ్​ మీనాక్షి నటరాజన్ తేల్చి చెప్పారు. నామినేషన్‌‌ తిరస్కరణకు చూపిస్తున్న కారణాలు సహేతుకంగా లేవని అన్నారు. అఫిడవిట్‌‌ నిబంధనల ప్రకా రం అడిగిన సమాచారాన్ని మాత్రమే అభ్యర్థులు పొందుపరుస్తారని, అటువంటిది అడగని విషయాలను వెల్లడించాలంటూ నామినేష న్లను తిరస్కరించడం సరికాదన్నారు.

ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీస్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఫార్మ్‌‌ -26లో స్పష్టంగా పేర్కొనని, అసలు అడగని వివరాలను అభ్యర్థులు ఎలా ఇవ్వగలరని ప్రశ్నించా రు. తన రాజ్యసభ నామిషన్ ను రిటర్నింగ్ అధికారి పక్కపెట్టడంపై ఆమె పలు ప్రశ్నలు సంధించారు. నోటీసుల వివరాలను కూడా తప్పనిసరిగా వెల్లడించాలన్న నిబంధన ఫార్మ్‌‌ 26లో ఎక్కడా లేదన్నారు. లేని నిబంధనను తెరపైకి తెచ్చి, దాని పేరుతో నామినేషన్లను తిరస్కరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఎన్నికల సంఘమే చెప్పాలన్నారు.