లా చదివి.. లక్స్ స్టోరీస్ పేరుతో ట్రావెలింగ్.. పెద్ద పెద్ద కంపెనీలే క్యూ కట్టిన సక్సెస్ జర్నీ !

లా చదివి.. లక్స్ స్టోరీస్ పేరుతో ట్రావెలింగ్.. పెద్ద పెద్ద కంపెనీలే క్యూ కట్టిన సక్సెస్ జర్నీ !

సంధ్య ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌ పేజీ ‘నియోటెరిక్‌‌‌‌‌‌‌‌ స్టైల్‌‌‌‌‌‌‌‌’ని ప్రస్తుతం 2.39 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అందరికీ నచ్చే కంటెంట్‌నే రెగ్యులర్​గా పోస్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తుంటుంది. ముఖ్యంగా ఆమెకు యూత్‌‌‌‌‌‌‌‌ ఫాలోయింగ్‌‌‌‌‌‌‌‌ చాలా ఎక్కువ. ఆమె పోస్టులు చూసి చాలామంది ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లు లోకల్ బ్రాండ్లను సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ట్రావెల్ కంటెంట్ చూసి క్లబ్‌‌‌‌‌‌‌‌ మహేంద్ర, యాంగ్రియా క్రూయిసెస్‌‌‌‌‌‌‌‌, యాత్రా ఇండియా లాంటి బ్రాండ్లతోపాటు అనేక రిసార్టులు, ట్రావెల్ బ్రాండ్లు  ఆమెతో కలిసి పనిచేశాయి.

సంధ్యకు ట్రావెల్ వ్లాగ్స్‌‌‌‌‌‌‌‌ అంటే ఇష్టం. అందుకే లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బిజీగా ఉన్నా.. కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వదులుకుని ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఇన్‌‌‌‌‌‌‌‌స్టాలో కూడా సామాజిక బాధ్యతతో మెలగాలని యూత్‌‌‌‌‌‌‌‌కి మెసేజ్‌‌‌‌‌‌‌‌ ఇస్తోంది. “లక్స్ స్టోరీస్‌‌‌‌‌‌‌‌” పేరుతో ఇండియాలోని ఎన్నో అన్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్లోర్డ్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లను చూపించి వైరల్‌‌‌‌‌‌‌‌ అయ్యింది. ఫ్యాషన్, బ్యూటీ, ట్రావెల్ రంగాల్లో తనదైన మార్క్ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసింది. 

సంధ్యానాయుడుది ముంబై. కష్టపడి చదివి లా కోర్స్‌‌‌‌‌‌‌‌ పూర్తి చేసింది. న్యాయవాదిగా కెరీర్ మొద​లుపెట్టి మంచి పేరు తెచ్చుకుంది. అప్పుడు లైఫ్​ చాలా రూల్స్, షెడ్యూల్స్‌‌‌‌‌‌‌‌తో నిండి ఉండేది. ఆమెకు అది నచ్చలేదు. మొదటినుంచి కంటెంట్‌‌‌‌‌‌‌‌ క్రియేషన్‌‌‌‌‌‌‌‌, ట్రావెలింగ్‌‌‌‌‌‌‌‌ మీద ఇంట్రెస్ట్‌‌‌‌‌‌‌‌ ఉండేది. అందుకే ‘లా’ కెరీర్‌‌‌‌‌‌‌‌ను పక్కన పెట్టి మరీ 2017లో ట్రావెల్‌‌‌‌‌‌‌‌ ఇన్​ఫ్లుయెన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఆమె జర్నీలో ఎన్నో సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగుతోంది. 

కొత్త ప్రదేశాలు చాలామంది ట్రావెల్‌‌‌‌‌‌‌‌ వ్లాగర్స్‌‌‌‌‌‌‌‌ ప్రపంచ ప్రసిద్ధ ప్రదేశాలను చూపిస్తూ ఆకట్టుకుంటుంటారు. పాపులర్ ప్లేసులకు మాత్రమే ప్రత్యేకతలు ఉంటాయా? అవి మాత్రమే అందంగా ఉంటాయా? మనకు అంతుచిక్కని అందాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని అన్వేషించడమే లక్ష్యంగా ట్రావెల్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది సంధ్య. ఇప్పటివరకు ఎవరూ చూపించని కొత్త ప్లేస్‌‌‌‌‌‌‌‌లను సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా ద్వారా చూపించాలని నిరంతరం తపిస్తోంది.  

మహారాష్ట్రలో ఉన్న రత్నగిరిలో గణపతి ఫూలే ఆలయం చాలా ఫేమస్‌‌‌‌‌‌‌‌. కానీ, అదే ప్రాంతంలో ఎంతో అందమైన అంజర్లే బీచ్ కూడా ఉంది. గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని కచ్ ఎడారిలో జరిగే ప్రపంచ ప్రసిద్ధ ఈవెంట్‌‌‌‌‌‌‌‌ ‘రాన్‌‌‌‌‌‌‌‌ ఉత్సవ్’ గురించి అందరికీ తెలుసు. కానీ, అదే ప్రాంతంలో ఉన్న ధోలావీరా ఫాజిల్ పార్క్  గురించి చాలామందికి తెలియదు. ఫేమస్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లను చూడాలనే తొందరలో చాలామంది అసలైన అందాలను చూడలేకపోతున్నారు. 

సరిగ్గా అలాంటి వాటిని వెతికి పట్టుకుని ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌ ద్వారా ప్రపంచానికి చూపిస్తోంది సంధ్య. అందులో భాగంగానే లోనావాలాలో డెల్లా డాటా రిసార్ట్‌‌‌‌‌‌‌‌, నాసిక్‌‌‌‌‌‌‌‌లో సోమా వైన్‌‌‌‌‌‌‌‌యార్డ్‌‌‌‌‌‌‌‌ లాంటి హిడెన్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లను కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది. జోధ్‌‌‌‌‌‌‌‌పూర్ ట్రిప్‌‌‌‌‌‌‌‌లో మెహరాంగఢ్ ఫోర్ట్, చంద్‌‌‌‌‌‌‌‌పోల్, పదమ్‌‌‌‌‌‌‌‌సర్ లేక్ చూపించింది. “ప్రపంచంలో ప్రతి మూలలో సౌందర్యం ఉంది. ఒక ప్రాంతపు మట్టి, నిర్మాణాలు కూడా మనకు ఎన్నో కథలు చెప్తాయి” అంటోంది సంధ్య. 

సామాజిక బాధ్యత 

‘‘ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లు కేవలం బ్రాండ్స్‌‌‌‌‌‌‌‌ని ప్రమోట్ చేయాలనే ఆలోచనతోనే ఉండకూడదు. బాధ్యతగా మెలగాలి. ఇ న్​ఫ్లుయెన్సర్లను కొన్ని లక్షలమంది ఆదర్శంగా తీసుకుంటారు. మనం ఒక్కరి జీవితంలో చిన్న సానుకూల మార్పు తీసుకొచ్చినా ప్రపంచాన్ని గెలిచినట్టు అనిపిస్తుంది” అంటోంది సంధ్య. అందుకే  మిల్లప్‌‌‌‌‌‌‌‌ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌తో కలిసి మహిళల సాధికారత కోసం పని చేసింది. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌లో నెస్ట్‌‌‌‌‌‌‌‌లే ఇండియాతో కలిసి ‘డబ్బావాలా’ కోసం కంట్రిబ్యూట్ చేసింది. కచ్‌‌‌‌‌‌‌‌కు దగ్గర్లోని ఒక ఊరిలో స్థానిక వీవర్లను సపోర్ట్ చేస్తూ బ్లాగ్ రాసింది. ఇలా ఎన్నోసార్లు తన ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్స్‌‌‌‌‌‌‌‌ను ఆఫ్‌‌‌‌‌‌‌‌లైన్ ఇంపాక్ట్‌‌‌‌‌‌‌‌గా మార్చింది. స్వయంగా అనేక ఎన్జీఓలు, ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌లతో కలిసి 
పనిచేసింది.