వామ్మో... ఇదేం కుక్కరా బాబూ.. వికారంగా ఉన్నా విజయం దానిదే..

వామ్మో... ఇదేం కుక్కరా బాబూ.. వికారంగా ఉన్నా విజయం  దానిదే..

పలు దేశాల్లో చాలా చాలా వింత వింత పోటీలు జరుగుతుంటాయి. ఇవేం పోటీలు అన్నంత విచిత్రంగా ఉంటాయి. అందమైన కుక్కల పోటీలు లేదా చురుకైన లేక తెలివైన కుక్కల కాంపిటీషన్‌ వంటి విచిత్రమైన పోటీలు గురించి విన్నాం. అంతేగానీ అత్యంత అసహ్యంగా ఉండే శునకాల పోటీ గురించి విన్నారా! ఔను అత్యంత వికారంగా ఉంటే శునకాల పోటీ కూడా ఉందట.  పైగా ఏటా భారీ ఎత్తున నిర్వహిస్తారట!

కాలిఫోర్నియాలో ఐదు దశాబ్దాలుగా వరల్డ్స్ అగ్లీయెస్ట్ డాగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. కుక్కల దత్తతని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇక 2023 కి గాను నిర్వహించిన పోటీల్లో ఈసారి ఏడేళ్ల చైనీస్ క్రెస్టెడ్ డాగ్ స్కూటర్ విజేతగా నిలిచింది. వెంట్రుకలు లేని చైనీస్ క్రెస్టెడ్ డాగ్‌ను సేవింగ్ యానిమల్స్ ఫ్రమ్ యుథనేషియా గ్రూప్ రక్షించిందట. రెస్క్యూ గ్రూప్‌లోని ఓ వ్యక్తి మొదట్లో దీనిని దత్తత తీసుకున్నాడు. అతని సంరక్షణలో స్కూటర్ 7 సంవత్సరాలు గడిపింది. ఇక అతను దాని సంరక్షణ కొనసాగించలేనని తెలిపినపుడు ఎల్మ్‌క్విస్ట్ అనే మహిళ దానిని దత్తత తీసుకుంది. ఈ కుక్క (స్కూటర్) ముందు కాళ్లపై నడుస్తుంది. వెనుక కాళ్లు సరిగా పనిచేయవు. చాలా తొందరగా అలసిపోతుంది. దీని శారీరక వైకల్యం పక్కన పెడితే ఇతర శునకాల మాదిరిగానే అన్ని విషయాల్లో యాక్టివ్‌గా ఉంటుంది.
కరోనా సమయంలో వాయిదాపడ్డ ఈ పోటీలు ఈ సంవత్సరం విజయవంతంగా నిర్వహించారట. శునకాల దత్తత.. అందంగా, ఆరోగ్యంగా లేని వాటి జీవితాల్లో ప్రేమ, ఆనందం పంచడం కోసం ఈ పోటీలను నిర్వహిస్తారని తెలుస్తోంది