తెలంగాణ ఉద్యమానికి చేర్యాలనే పునాది : కొమ్మూరి ప్రతాపరెడ్డి

తెలంగాణ ఉద్యమానికి చేర్యాలనే పునాది : కొమ్మూరి ప్రతాపరెడ్డి

చేర్యాల, వెలుగు : తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు చేర్యాల ప్రాంతమే పునాది అని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కడవేర్గు గ్రామంలో కాంగ్రెస్​ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ మలి దశ ఉద్యమం ఇక్కడి నుంచే ప్రారంభించారని, అలాంటి ఉద్యమ ప్రాంతాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. చేర్యాల రెవెన్యూ డివిజన్​ కోసం జేఏసీల ద్వారా ఉద్యమం జరుగుతుంటే పల్లా రాజేశ్వర్​ రెడ్డి వారిని రాజకీయ నిరుద్యోగులనడం సిగ్గుచేటన్నారు.

పిడికెడు మందితో రెవెన్యూ డివిజన్​ వస్తుందా అనడం ఆయన నీతికి నిదర్శనమన్నారు. ఆయనకు ఇక్కడి నుంచి పోటీ చేసే అర్హత లేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా నర్సాయపల్లి గ్రామానికి చెందిన 200 మంది బీఆర్​ఎస్​ నాయకులు కాంగ్రెస్​లో చేరారు.  కార్యక్రమంలో కడవేర్గు, పోతిరెడ్డిపల్లి, పెద్దరాజుపేట గ్రామాలకు చెందిన కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.