పీసీసీ నిర్ణయాలపై కాంగ్రెస్ నేతల అసంతృప్తి

పీసీసీ నిర్ణయాలపై కాంగ్రెస్ నేతల అసంతృప్తి

హైదరాబాద్: పీసీసీ నిర్ణయాలపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తిగా ఉన్న నేతలు ఇవాళ సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీనియర్లను కలుపుకుని పోవడం లేదని గుర్రుగా ఉన్న నేతలు ఇదే విషయంపై ఇవాళ చర్చించినట్లు తెలుస్తోంది. తార్నాకలోని మర్రి శశిధర్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోమవారం భేటీ అయ్యారు. జగ్గారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, గీతారెడ్డి,  నిరంజన్ రెడ్డితో పాటు ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చించారు. పీసీసీ నిర్ణయాలపై అధిష్టానానికి మరోసారి ఫిర్యాదు చేయాలనుకుంటున్నట్లు సమాచారం.  
కాంగ్రెస్​ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీకి పూర్వ వైభవం రావాలనే దానిపై చర్చించామన్నారు. పార్టీ వ్యవహారాలు చూస్తున్న వారు పార్టీకి అనుబంధంగా ఉన్నారా ? లేదా ? అనేది చూడాలన్నారు. వచ్చే ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని పార్టీ ఏవిధంగా ప్రజల విశ్వాసం పొందుతుందనే దానిపై నిర్ణయాలు ఉండాలన్నారు. పార్టీలో సంస్థాగతమైన మార్పులు జరగాలని వర్కింగ్ కమిటీ సోనియా గాంధీని కోరారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో సోనియా గాంధీ నిర్వహించిన దానిపై చర్చించామన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం ఉండాలని చర్చించామన్నారు. వీహెచ్ చెప్పిన అంశాలు చర్చకు వచ్చాయని అవన్నీ మీడియా కు చెప్పలేనన్నారు. కాంగ్రెస్ కు రెట్టింపు బలం కోసం ఏ విధంగా పని చేయాలనే దానిపై చర్చించామన్నారు. 
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ పార్టీలో ఇటీవల జరిగిన పరిణామాలపై చర్చించామని, సీనియర్ల విషయంలో జరుగుతున్న అవమానాలపై చర్చించామన్నారు. రాష్ట్ర విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామన్నారు.