టీఆర్ఎస్ అసంతృప్తి నేతల సమావేశం

టీఆర్ఎస్ అసంతృప్తి నేతల సమావేశం

సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావు అసంతృప్తి నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి క్రిష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పిడమర్తి రవి ఖమ్మంలో భేటీ అయ్యారు. వీరంతా తాజా రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించినట్లు సమాచారం.