సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీల్లో మెగా పీటీఎం సక్సెస్..అటెండ్ అయిన 33 వేల మందికి పైగా పేరెంట్స్

సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీల్లో మెగా పీటీఎం సక్సెస్..అటెండ్ అయిన 33 వేల మందికి పైగా పేరెంట్స్

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీల్లో విద్యా ప్రమాణాల పెంపు లక్ష్యంగా చేపట్టిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ (పీటీఎం) సక్సెస్ అయ్యాయి. శుక్రవారం 430 జూనియర్ కాలేజీల్లో సమావేశాలు జరిగాయని, వాటికి 33,880 మంది పేరెంట్స్ హాజరయ్యారని ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య తెలిపారు. పలు కాలేజీల్లో స్పెషల్ ఆఫీసర్లు, డీఐఈఓలు అటెండ్ అయ్యారు. 

ఈ సందర్భంగా కాలేజీల్లో విద్యార్థుల స్టడీ, అటెండెన్స్, వారి ప్రవర్తన గురించి పేరెంట్స్‌‌‌‌‌‌‌‌కు వివరించారు. కాలేజీల్లో ప్రభుత్వం చేపట్టిన భద్రతా చర్యల్లో భాగంగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేశామని, అటెండెన్స్ కోసం ఎఫ్‌‌‌‌‌‌‌‌ఆర్ఎస్ అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ సహకారంతో జేఈఈ, నీట్, ఎప్‌‌‌‌‌‌‌‌సెట్, క్లాట్ తదితర పోటీ పరీక్షలకు ఆన్‌‌‌‌‌‌‌‌98లైన్ క్లాసులు తీసుకుంటున్నామని వివరించారు. కాగా, పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, వారి పేరెంట్స్‌‌‌‌‌‌‌‌కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా పేరెంట్స్ నుంచి సూచనలు, సలహాలను తీసుకున్నారు.