Sai Durgha Tej: మావయ్యలే నా బలం: 'సంబరాల ఏటిగట్టు' వేదికపై 'సాయి దుర్గా తేజ్ ఎమోషనల్ స్పీచ్!

Sai Durgha Tej: మావయ్యలే నా బలం: 'సంబరాల ఏటిగట్టు' వేదికపై 'సాయి దుర్గా తేజ్ ఎమోషనల్ స్పీచ్!

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్( సాయి ధరమ్ తేజ్ ) నటిస్తున్న మొదటి పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ (SYG) నుండి విడుదలైన ‘అసుర ఆగమన గ్లింప్స్’ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. బుధవారం తేజ్ పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఈ గ్లింప్స్ లాంచ్ ఈవెంట్, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. పీరియాడికల్ కథాంశంతో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని కొత్త దర్శకుడు రోహిత్ కె.పి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

మావయ్యలే నా సర్వస్వం..

ఈ వేదికపై సాయి దుర్గా తేజ్ ఎమోషనల్‌గా మాట్లాడారు. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మావయ్యలే కారణమని చెప్పారు. వారి ప్రేమ, ప్రోత్సాహానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కోసం తాను తన సర్వస్వం ధారపోశానని స్పష్టం చేశారు. అద్భుతమైన క్వాలిటీతో, ఏ మాత్రం రాజీ పడకుండా ఈ చిత్రాన్ని మీకు అందిస్తున్నాం. నా 'విరూపాక్ష'కు మ్యూజిక్ అందించిన అజనీశ్ లోక్‌నాథ్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం ఇస్తున్నారు. 'సంబరాల ఏటిగట్టు' అవుట్‌స్టాండింగ్‌గా ఉంటుంది. మీరంతా చూసి తప్పక ఎంజాయ్ చేస్తారు, అది నా ప్రామిస్ అని తేజ్ ధీమా వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ తర్వాత వచ్చిన ఈ సినిమా తనకు ఎంతో కీలకం అని పేర్కొన్నారు.

తేజ్ బౌన్స్ బ్యాక్ 

కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. తేజ్ పడిన కష్టానికి, సినిమా విజయం రూపంలో ప్రేక్షకులు ప్రతిఫలం ఇస్తారనే నమ్మకం ఉందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేశారు. తేజ్ యాక్సిడెంట్ నుండి బౌన్స్ బ్యాక్ అయిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని దర్శకుడు రోహిత్ అభినందించారు. తనది మొదటి సినిమా అయినా, నిర్మాతలు ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా అద్భుతమైన నిర్మాణ విలువలతో ఈ పీరియాడికల్ డ్రామాను నిర్మిస్తున్నారని తెలిపారు. డీఓపీ పళని స్వామి తమ టీమ్ మొత్తం రోహిత్ విజన్‌ను తెరపై అద్భుతంగా చూపించడానికి కష్టపడుతున్నామని చెప్పారు.

ఈ వేడుకలో దర్శకులు దేవా కట్టా, వశిష్ఠ, వి.ఐ. ఆనంద్, నిర్మాత వివేక్ కూచిబొట్ల వంటి ప్రముఖులు పాల్గొని చిత్ర బృందాన్ని అభినందించారు. నాటకీయ అంశాలు, బలమైన కథా కథనం ఉన్న ‘సంబరాల ఏటిగట్టు’ తెలుగుతో పాటు ఇతర దక్షిణ భారతీయ భాషల్లో, హిందీలో విడుదల కానుంది.