మేఘాలయ బొగ్గుగని ఘటన : 77 రోజుల తర్వాత.. రెండో శవం

మేఘాలయ బొగ్గుగని ఘటన : 77 రోజుల తర్వాత.. రెండో శవం

షిల్లాంగ్‌ : మేఘాలయ బొగ్గు గని నుంచి 77 రోజుల తర్వాత రెండో మృతదేహాన్ని బయటికి తీశారు. తూర్పు జయంతియా జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గు గనిలో గత డిసెంబరు 13న 15మంది కార్మికులు చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సహాయక చర్యలు చేస్తున్న నేవీ సిబ్బం ది గురువారం రెండో మృతదేహాన్ని వెలికితీసింది. గనిలోపల 200 అడుగుల లోతులో బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని తీశామని నేవీ, ఎన్డీఆర్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌ సిబ్బంది చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌ కు తరలించారు. జనవరి 23న బొగ్గుగని నుంచి ఒకరి మృతదేహాన్ని వెలికితీసిన సంగతి తెలిసిందే. తూర్పు జయంతియా జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగనిలోకి దిగిన కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. నీరు ఎక్కువగా ప్రవహించడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.