క్లారిటీ ఇచ్చిన గాడ్ ఫాదర్ టీమ్

క్లారిటీ ఇచ్చిన గాడ్ ఫాదర్ టీమ్

మెగాస్టార్ చిరంజీవి పేరు మారింది అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' ఫస్ట్ లుక్ సోమవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో 'Megastar Chiranjeevi' అని ఉండాల్సిన పేరులో 'Megastar Chiranjeeevi'గా ఉంది. దీంతో చిరు పేరు మార్చుకున్నారని ప్రచారం జరిగింది. సోషల్ మీడియా, కొన్ని న్యూస్ ఛానెల్స్ చిరు పేరు మార్చుకున్నారు అంటూ వైరల్ చేశారు. అయితే దీనిపై గాడ్ ఫాదర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. గాడ్ ఫాదర్ మూవీ ఫస్ట్ లుక్ వీడియోలో చిరంజీవి పేరులో రెండు E లకు బదులుగా.. ఇంకొక E యాడ్ అయిందని తెలిపారు. ఇది పొరపాటున జరిగిందని అని గాడ్ ఫాదర్ పీఆర్ టీమ్ వెల్లడించింది. దీంతో చిరంజీవి పేరు మార్పుపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది.