
తన ఇంటి హాల్ ను వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రం చేసిన చిరంజీవి, ఆ తర్వాత కిచెన్ లో దోశ వేశారు. దోశ తినమంటూ తన తల్లి అంజనాదేవికి ప్లేట్ పెట్టి ఇచ్చారు. నేను తింటాలే… ముందు నువ్వు తిను అంటూ ఓ ముక్కను బిడ్డకు తినిపించారు. ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా “వకీల్ సాబ్”లోని “మగువా మగువా…” అనే పాట వినిపిస్తోంది. చిరంజీవి పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటిపని, తోటపని చేస్తున్న వీడియోను పోస్ట్ చేసిన సినీ నటుడు ఎన్టీఆర్, చిరంజీవి తదితరులకు ఓ చాలెంజ్ ను విసిరారు. దీనిపై స్పందించిన చిరంజీవి, తాను రోజూ ఈ పనులు చేస్తానని తెలిపారు. “ఇదిగో భీమ్… నేను రోజూ చేసే పనులే… ఇవాళ మీ కోసం ఈ వీడియో సాక్ష్యం. నేను ఇప్పుడు కేటీఆర్ ను, నా స్నేహితుడు రజనీకాంత్ కు ‘బీ ది రియల్ మ్యాన్’ చాలెంజ్ ని విసురుతున్నాను” అంటూ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు చిరంజీవి.
Here it is Bheem @tarak9999 నేను రోజు చేసే పనులే…ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం. And I now nominate @KTRTRS & my friend @rajinikanth #BeTheRealMan challenge. pic.twitter.com/y6DCQfWMMm
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 23, 2020