వకీల్‌సాబ్ కేసులనే కాదు.. మనసుల్నీ గెలుస్తాడు

V6 Velugu Posted on Apr 10, 2021

  • మూడు సంవత్సరాల తర్వాత కూడా పవన్‌లో అదే వేడి, వాడి

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘వకీల్ సాబ్’ సినిమా శుక్రవారం విడుదలై అన్ని వర్గాలనుంచి మంచి ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాలో పవన్.. పవర్‌ఫుల్ లాయర్‌గా నటించి అందరినీ మెప్పించాడు. ఈ సినిమాను పవన్ అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి చూశాడు. ఈ సినిమా చాలా బాగుందని చిత్ర యూనిట్‌ను చిరంజీవి మెచ్చుకున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్‌ల మధ్య వచ్చే కోర్టు సీన్ అద్భుతంగా ఉందని చిరూ అన్నారు. మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ఇదని.. అయినా కూడా పవన్‌లో అదే వేడి, వాడి ఉందని చిరూ అన్నారు. సినిమా యూనిట్‌ను, పనితీరును మెచ్చుకుంటూ.. చిరంజీవి ట్వీట్ చేశారు.

‘మూడు సంవత్సరాల తర్వాత కూడా మళ్లీ పవన్‌లో అదే వేడి, వాడి. పవన్, ప్రకాష్ రాజ్‌ల మధ్య వచ్చే కోర్టు రూం డ్రామా అద్భుతం. నివేదా థామస్, అంజలి, అనన్య వాళ్ల వాళ్ల పాత్రల్లో జీవించారు. తమన్ మ్యూజిక్ ద్వారా, వినోద్ డీఓపీ ద్వారా సినిమాకు ప్రాణం పోశారు. అన్నింటికి మించి మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని తెలియజేసే ఒక అత్యవసరమైన చిత్రం ఇది. ఈ వకీల్ సాబ్ కేసులనే కాదు, అందరి మనసుల్నీ గెలుస్తాడు. నిర్మాతలు దిల్ రాజుకి, బోనీ కపూర్‌కి, డైరెక్టర్ వేణు శ్రీరాంతో పాటు మిగతా టీం మొత్తానికి నా శుభాకాంక్షలు’ అని చిరూ ట్వీట్ చేశారు.

https://twitter.com/KChiruTweets/status/1380747319402844165

Tagged MegaStar Chiranjeevi, Actor Pawan kalyan, vakeel saab

Latest Videos

Subscribe Now

More News