
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ(Sreeja Konidela) గుడ్ న్యూస్ చెప్పారు. తాజాగా ఆమె వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తన సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. శ్రీజ ఇటీవల స్టూడియో అనంత(Studio Ananta) పేరుతో హైదరాబాద్‌లో ఓ ఫిట్‌నెస్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్, బాలీవుడ్ నుండి టాప్ సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిలో సందీప్ కిషన్, రెజీనా వంటి స్టార్ ఉన్నారు.
అయితే.. తాను ఇలా వ్యాపార రంగంలోకి రావడం, ఫిట్‌నెస్ సెంటర్‌లో భాగం కావడం థ్రిల్లింగ్‌గా ఉందంటూ పోస్ట్ చేశారు శ్రీజ. అంతేకాదు.. ఈ ఫిట్‌నెస్ సెంటర్‌లో జిమ్, యోగా కూడా ఉంటాయని తెలిపారు. దీంతో ఆ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.