
- యాదవ హక్కుల పోరాట సమితి డిమాండ్
హైదరాబాద్, వెలుగు : మంత్రి వర్గంలో యాదవ సామాజిక వర్గానికి చోటు కల్పించాలని కోరుతూ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం యాదవ హక్కుల పోరాట సమితి సభ్యులు గాంధీ భవన్ ముందు శాంతియుతంగా నిరసన తెలిపారు. గొల్ల కురుమలకు మంత్రి, మూడు ఎమ్మెల్సీలు, ఆరు కార్పొరేషన్ పదవులు కేటాయించాలన్నారు.పీసీసీలో సముచిత స్థానం కల్పించాలని విన్నవించారు.